Fenugreek: మెంతులతో.. బరువుతోపాటు బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా తగ్గించుకోవచ్చు.. తెలుసా?

Health Benefits of Fenugreek: పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల చర్యలు తీసుకుంటుంటారు. కొంతమంది జిమ్‌లల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటే.. మరి కొంతమంది తినే ఆహారం విషయంలో ప్రత్యేక

Fenugreek: మెంతులతో.. బరువుతోపాటు బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా తగ్గించుకోవచ్చు.. తెలుసా?
Methi Benefits
Follow us
Shaik Madar Saheb

| Edited By: Team Veegam

Updated on: Mar 30, 2021 | 5:11 PM

Health Benefits of Fenugreek: పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల చర్యలు తీసుకుంటుంటారు. కొంతమంది జిమ్‌లల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటే.. మరి కొంతమంది తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ డైటింగ్ చేస్తుంటారు. అయినప్పటికీ చాలామందిలో నిరాశే కనిపిస్తుంటుంది. అయితే బరువు తగ్గేందుకు మన వంట గదిలోనే అనేక ఔషధాలు ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే అలాంటి ఔషధాల్లో మెంతులు ఒకటి. మెంతులు తినడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. మెంతి గింజల్లో అనేక పోషక లక్షణాలు ఉన్నాయి. అవి సూపర్ ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

మెంతి గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉన్నాయి. మీరు మెంతి గింజలను క్రమంగా ఉపయోగిస్తే బరువు సులువుగా తగ్గుతుంది. మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. మెంతులు తినడం వల్ల డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగం కలుగుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.

మెంతి నీటితో.. ఎన్నో ఉపయోగాలు.. బరువు తగ్గడానికి.. ఉదయం పరిగడుపున మెంతి నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి వేళ నిద్రపోయే ముందు ఒక గ్లాసులో కొన్ని మెంతి గింజలు వేసి నానా బెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగితే సరిపోతుంది. లేకపోతే.. మెంతులను నీటిలో మరిగించి తాగాలి. ఇలా చేస్తే శరీరంలోని కొవ్వు మొత్తం కరుగుతుంది. ఈ పానీయంలో జీరో కేలరీలే ఉంటాయి. దీంతోపాటు మెంతులు తింటే.. మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.

మెంతి టీతో.. బెల్లీ ఫ్యాట్‌కు చెక్.. తక్కువ కేలరీల టీ తాగాలనుకుంటే మెంతి టీ ఉత్తమం. ఈ టీ ప్రత్యేకత ఏమిటంటే బెల్లీ ఫ్యాట్ (బొడ్డు చుట్టూ కొవ్వు) ను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఒక చెంచా మెంతులు, దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం నీటిలో వేసి మరిగించి తాగాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఫ్యాట్ బర్న్ అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ప్రతిరోజూ తాగితే బరువు కూడా తగ్గవచ్చు.

హెర్బల్ టీ.. బరువు తగ్గడానికి మెంతుల్లో తేనె కూడా వాడవచ్చు. తేనె రోగనిరోధక శక్తిని పెంచేది. కావున మెంతులను నీటిలో మరిగించి.. తేనే కలిపి తాగవచ్చు. వాటికి కొంచెం నిమ్మరసం జోడిస్తే.. హెర్బల్ టీ లాగా అవుతుంది.

Also Read: చాక్లెట్‌తో ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే అస్సలు వదలరు.. మహిళలకు ఎందుకంత ఇష్టమో తెలుసా..?

Eyesight Remedies: కంటి చూపును ఇలా మెరుగు పర్చుకోండి.. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులే..

జబర్ధస్త్ షూటింగ్ సెట్‏లో టీమ్‏ లీడర్ల మధ్య గొడవ.. ఆత్మహత్య ప్రయత్నం చేసిన వర్ష..