Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే, ఈ కూరగాయలు బెస్ట్ ఆప్షన్.. రోజూ ఇలా చేస్తే..
Weight Loss Tips in Telugu: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా, ప్రజల ఆహారపు అలవాట్లు చాలా వరకు మారిపోయాయి. అనారోగ్యకరమైన దినచర్య కారణంగా చాలా మంది ప్రజలు త్వరగా ఊబకాయం బారిన పడుతున్నారు.

Weight Loss Tips in Telugu: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా, ప్రజల ఆహారపు అలవాట్లు చాలా వరకు మారిపోయాయి. అనారోగ్యకరమైన దినచర్య కారణంగా చాలా మంది ప్రజలు త్వరగా ఊబకాయం బారిన పడుతున్నారు. అయితే, బరువు పెరగడం సాధారణ సమస్యగా మారింది. బరువు తగ్గడానికి ఎన్ని కసరత్తులు చేసినప్పటికీ.. చాలా మంది బరువు మాత్రం తగ్గడం లేదు. అయితే, ఆహారంలో మార్పుల ద్వారా పెరుగుతున్న బరువును నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని చిట్కాలు పాటిస్తే బరువు సులభంగా తగ్గొచ్చని పేర్కొంటున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మనకు సులభంగా దొరికే కొన్ని కూరగాయలతో బరువు తగ్గొచ్చని పేర్కొంటున్నారు. ఈ సీజన్‌లో మీరు ఈ కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకుంటే.. బరువు అదుపులో ఉంటుందని.. ఇంకా బరువు తగ్గొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గేందుకు ఈ విధంగా ట్రై చేయండి..
సొరకాయ జ్యూస్: సోరకాయలో పోషకాలతో పాటు నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే.. వేసవిలో బరువు తగ్గాలనుకుంటే సొరకాయ రసం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.. సాధారణంగా సొరకాయను ఎక్కువగా తింటారు. కూర, చట్నీ ఇలా అనేక రకాలుగా చేసుకుని తింటారు. అయితే, బరువు తగ్గాలనుకుంటే సొరకాయ రసం కూడా తాగవచ్చు. చాలా మంది ఈ కూరగాయను ఇష్టపడనప్పటికీ.. దీనిలో పీచు ఎక్కువగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.
దోసకాయ జ్యూస్: వేసవిలో మార్కెట్‌లో దోసకాయలు బాగా దొరుకుతాయి. దోసకాయలో చాలా నీరు ఉంటుంది. దోసకాయ తినడం వల్ల మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మీరు దీన్ని మీ ఆహారంలో అనేక విధాలుగా చేర్చవచ్చు. ఇందులో జీరో క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గడానికి దోసకాయ కూడా మంచి ఎంపిక.




కాకరకాయ జ్యూస్: చాలా మంది చేదును తినడానికి ఇష్టపడరు. అయితే, అనేక వ్యాధుల చికిత్సలో కాకరకాయ ప్రభావవంతంగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తప్పనిసరిగా తినాలని సూచిస్తారు. అదేవిధంగా, ఈ కూరగాయ బరువు తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. కాకరకాయ రుచిలో చేదుగా ఉంటుంది. అయితే ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
బెండకాయ: చాలా మంది పిల్లలు బెండకాయ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ కూరగాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది బరువు తగ్గించడంలో కూడా మీకు సహాయపడుతుంది. దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..