Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: 60 ఏళ్లు దాటినవారు బరువు తగ్గాలంటే ఈ వ్యాయామాలు చక్కటి పరిష్కారం..

Weight Loss: వృద్ధాప్యంలో జీవక్రియ మందగించడం వల్ల ఎక్కువగా బరువు పెరుగుతారు. అధిక బరువు వల్ల అంతర్గత అవయవాలపై ఒత్తిడి ఎక్కువై గుండె, కిడ్నీ సమస్యలు వచ్చే

Weight Loss: 60 ఏళ్లు దాటినవారు బరువు తగ్గాలంటే ఈ వ్యాయామాలు చక్కటి పరిష్కారం..
Senior Citizens
Follow us
uppula Raju

|

Updated on: Nov 22, 2021 | 5:44 PM

Weight Loss: వృద్ధాప్యంలో జీవక్రియ మందగించడం వల్ల ఎక్కువగా బరువు పెరుగుతారు. అధిక బరువు వల్ల అంతర్గత అవయవాలపై ఒత్తిడి ఎక్కువై గుండె, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో పాటు, కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందువల్ల, వృద్ధులు తమ బరువును నియంత్రించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 30 మరియు 40 సంవత్సరాల కంటే 60 ఏళ్ల వయస్సు ఉన్నవారికి బరువు తగ్గడం చాలా కష్టం. మొదటిది అతని జీవక్రియ సరిగ్గా ఉండదు. రెండోది అతను బరువు తగ్గడానికి కఠినమైన వ్యాయామాలు చేయలేడు. వారు కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడే కొన్ని సాధారణ వ్యాయామాలను ఎంచుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. యోగా యోగా అనేది తక్కువ-ప్రభావ వ్యాయామం. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. చలనశీలతను పెంచుతుంది. 60 ఏళ్ల వయస్సులో బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి యోగా కన్నా మంచి వ్యాయామం మరొకటి లేదు. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల వృద్ధులు సరైన సమయానికి నిద్రిస్తారు. కడుపు సమస్యలు ఉండవు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇది కీళ్లపై కూడా ఎక్కువగా ప్రభావం చూపదు.

2. నడక 60 ఏళ్ల వయస్సులో ఉన్న వారికి నడక ఉత్తమ ఎంపిక. రన్నింగ్‌ కీళ్ల నొప్పులను పెంచుతుంది గాయాల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి నడవడం మంచిది. ఇది పెద్ద మొత్తంలో కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది. రోజుకు 30 నిమిషాలు నడవడం వల్ల మంచి షేప్ వస్తుంది.

3. పైలేట్స్ బరువు తగ్గడానికి పైలేట్స్ (Pilates) ఒక గొప్ప వ్యాయామం. ఇది ఒక దగ్గర ఉండి కాళ్లు, చేతులు సాగదీస్తూ చేసే వ్యాయామం. దీనివల్ల వెన్నునొప్పి తగ్గించడం, కేలరీలను బర్న్ చేయడం జరుగుతుంది.

4. శరీర బరువు వ్యాయామాలు వ్యాయామం చేయడం 60 ఏళ్లలోపు వారికి కష్టంగా ఉంటుంది. అందుకే శరీర బరువు వ్యాయామాలు చేస్తే బాగుంటుంది. అంటే స్క్వాట్స్, లంగ్స్, శ్వాస సంబంధమైన వ్యాయామాలు ఉత్తమం. రెసిస్టెన్స్ బ్యాండ్ వ్యాయామాలు కూడా ప్రయత్నించవచ్చు.

రోహిత్‌ శర్మ పని పూర్తయింది.. కానీ విరాట్‌ కోహ్లీ, రహానే పని మిగిలే ఉంది.. ఏంటో తెలుసా..?

ఇల్లు కొనడానికి బంపర్‌ ఆఫర్.. ఈ-వేలంలో పాల్గొనండి.. తక్కువ ధరకే కొనుగోలు చేయండి..

SMAT 2021: చివరిబంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన షారుక్‌ ఖాన్‌.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత తమిళనాడు