Diabetes: ఇన్సులిన్ వాడుతున్న షుగర్ పేషెంట్స్‌కు సైతం మంచి మెడిసిన్.. మెంతులు, మెంతికూర అంటున్న నిపుణులు

Diabetes: ఆరోగ్యంగా జీవించాలంటే సమతుల పౌష్టికాహారం తీసుకోవాలని.. ముఖ్యంగా తినే ఆహారంలో పచ్చని ఆకుకూరలను చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు..

Diabetes: ఇన్సులిన్ వాడుతున్న షుగర్ పేషెంట్స్‌కు సైతం మంచి మెడిసిన్.. మెంతులు, మెంతికూర అంటున్న నిపుణులు
Diabetes Methi
Follow us
Surya Kala

|

Updated on: Nov 22, 2021 | 6:51 PM

Diabetes: ఆరోగ్యంగా జీవించాలంటే సమతుల పౌష్టికాహారం తీసుకోవాలని.. ముఖ్యంగా తినే ఆహారంలో పచ్చని ఆకుకూరలను చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి మంచి పోషకాలను అందించే ఆకు కూర మెంతి కూర. మెంతికూర మాత్రమే కాదు.. మెంతి గింజలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయని అంటున్నారు. అవును భారతతీయులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు మెంతి లేదా మెంతికూర. వీటిని పూర్వకాలం నుంచి తినే ఆహారంలో భాగంగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మెంతి కూరని తినడానికి చిన్న పిల్లలు మారం చేస్తారు కానీ వీటి ప్రయోజనాలు తెలిస్తే తప్పనిసరిగా అలవాటు చేస్తారు. కొన్ని ఏళ్ల క్రితం వరకూ ఇంట్లో స్త్రీలు బహిష్టు సమయంలో లేదా ప్రసవం తర్వాత లేదా కేవలం కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుంటే.. ఒక చెంచా మెంతి గింజలను నీటితో మింగమని బామ్మ చిట్కాగా చెప్పేవారు. ఈ మెంతి ఆకులు లేదా మెంతులు పొత్తికడుపు నొప్పి,  వెన్నునొప్పిని తగ్గిస్తాయి. అయితే ఇప్పుడు ఈ మెంతులల్లో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని పలు అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది.

గత కొన్ని సంవత్సరాలుగా మెంతులు యొక్క ఔషధగుణాలు, క్రియాత్మక లక్షణాలపై అనేక అధ్యయనాలు చేశారు. సౌదీ అరేబియాలోని సౌద్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం మెంతి కూర, మెంతి గింజల్లో ఔషధ విలువలను కలిగి ఉన్నాయని తెలుస్తోంది. యాంటీడయాబెటిక్, యాంటీఫెర్టిలిటీ, యాంటీకాన్సర్, యాంటీమైక్రోబయల్, యాంటీపరాసిటిక్, చనుబాలివ్వడం ఉద్దీపన,  హైపోకొలెస్టెరోలెమిక్ ప్రభావాలను మెంతులు కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అందుకనే మెంతులను రోజు తినే ఆహారంలో భాగంగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు. తికూరలో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి.

డయాబెటిస్ , కొలెస్ట్రాల్ చికిత్స: 

ప్రస్తుతం ఎక్కువ మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. టైప్ 1 , టైప్ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు మెంతులు వాడడం వలన జీవక్రియపై ప్రభావం చూపించిందని.. తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలోకి వచ్చాయని చెప్పారు. అంతేకాదు మధుమేహ రోగి గ్లూకోస్ టాలరెన్స్ మెరుగుపడిందని తెలిపారు.

ఇన్సులెన్ తీసుకుంటున్న టైప్ 1 మధుమేహం ఉన్న రోగులపై అధ్యయనం చేశారు. రోజు వారీ ఆహారంలో 100 గ్రాముల  మెంతి గింజల పొడిని జోడించారు. దీంతో కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ తో పాటు ట్రైగ్లిజరైడ్‌లు తగ్గుముఖం పట్టాయని తమ అధ్యయనంలో తెలిసిందని పరిశోధకులు చెప్పారు.

మెంతులోని యాంటీవైరల్ లక్షణాలు జలుబు ,గొంతు నొప్పి నివారణకు మంది ఔషధంగా ఉపయోగపడతాయి. కీళ్లనొప్పులు, జుట్టు రాలడం, మలబద్ధకం, కడుపు నొప్పి, మూత్రపిండ వ్యాధులు, గుండెల్లో మంట, పురుషుల నపుంసకత్వం, ఇతర రకాల లైంగిక  సంబంధ చికిత్సలో కూడా ప్రభావవంతంగా మెంతులు పనిచేస్తాని చెప్పారు.

అందుకనే మెంతి గింజలు, మెంతి కూరను తినే ఆహారంలో భాగంగా చేసుకోమని సూచిస్తున్నారు. మొలకెత్తిన మెంతి గింజలు మంచి ఆరోగ్య ప్రయోజనకరమైనవని చెబుతున్నారు.

గమనిక: అయితే మెంతులను మధుమేహ వ్యాధి గ్రస్తులు తీసుకునే ముందు వైద్యుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also Read:  ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటానంటున్న చంద్రబాబు.. వరద బాధిత ప్రాంతాల్లో ఈనెల 23,24న పర్యటన