Chanadrababu: ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటానంటున్న చంద్రబాబు.. వరద బాధిత ప్రాంతాల్లో ఈనెల 23,24న పర్యటన

Nara Chanadrababu: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన పార్టీ నేతలకు,..

Chanadrababu: ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటానంటున్న చంద్రబాబు..  వరద బాధిత ప్రాంతాల్లో ఈనెల 23,24న పర్యటన
Chandrababu
Follow us

|

Updated on: Nov 22, 2021 | 5:55 PM

Nara Chanadrababu: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా టీడీపీ ఆధ్వర్యంలో బృందాలు నిలబడాలని కోరారు. అంతేకాదు రాష్ట్రంలో వరదల వల్ల ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ భారీ వర్షాలు వరదల వలన ఇప్పటి వరకు 34 మంది వరకు చనిపోయారు, 10 మంది గల్లంతయ్యారని ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తు చేశారు..

వరదబాధిత [ప్రాంతాలను సీఎం జగన్ హెలికాఫ్టర్ లో ఏరియల్ రివ్యూ తో చూసి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు బాధితులకు అవసరమైన సహాయ కార్యక్రమాలను అందించడంలో విఫలమయ్యారని చెప్పారు. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంలో సీఎం జగన్ విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ అజాగ్రత్త వల్లే, ముందస్తు జాగ్రత్త చర్యలు లేకపోవడం వల్లే ఇంత మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు.

తాను ఇక నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటానని.. ఈ నెల 23, 24 తేదీల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పారు చంద్రబాబు. రాజధానిపై జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరుగుతోంది.. ఉపాధి అవకాశాలు పోవడంతో పాటు రాష్ట్ర ఆదాయానికి పెద్దఎత్తున గండి పడుతుందని అన్నారు.

ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన అల్లుడే చంపించాడని కట్టుకథలు అల్లిస్తూ దోషులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. ప్రజా సమస్యలు, అవినీతి, వివేకానందరెడ్డి హత్య నుంచి ప్రజలను  తప్పుదారి పట్టించేందుకే ప్రతిపక్ష నేత వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. ఇక అధికార పార్టీ కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో  అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది.. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో జగన రెడ్డి పాలనపై వ్యతిరేకత నెలకొంది. శాంతిభద్రతలు క్షీణించాయని చంద్రబాబు ఆరోపించారు.

Also Read:  ఆల్ టైం హైకి టమాటా ధర.. చికెన్‌తో పోటీపడుతున్న కూరగాయలు.. సామాన్యుడి కంట కన్నీరు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..