Microplastics in Food: ఒంట్లోకి చేరుతున్న లక్షలాదిగా మైక్రోప్లాస్టిక్స్.. పూర్తిగా ఆపలేకపోయినా ఈ పనులు మనమూ చేద్దాం..!
క్యాన్సర్ వంటి భయకర రోగాలకు మూలం మైక్రోప్లాస్టిక్స్. వీటిని మన జీవితం నుంచి పూర్తిగా తొలగించలేం. కానీ మనం చేసే చిన్నచిన్న పనుల వల్ల వీటిని తక్కువగా శరీరంలోకి వచ్చేలా చేయవచ్చు. నేటి కాంలో మనం పీల్చే గాలిలో, త్రాగే నీటిలో, తినే ఆహారంలో మైక్రోప్లాస్టిక్‌లు ప్రతిచోటా ఉన్నాయి. మానవ రక్తం, ఊపిరితిత్తులు, మెదడులో కూడా ఇలాంటి ..

నేటి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదు. జీవనశైలి, ఆహారంలో మార్పులు కారణంగా నిత్యం అనారోగ్య సమస్యలు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా మైక్రోప్లాస్టిక్‌లు వివిధ రూపాల్లో శరీరంలోకి ప్రవేశించడం మూలంగా ఎన్నో అనర్ధాలు దాపురిస్తాయంటున్నారు నిపుణులు. మనం పీల్చే గాలిలో, త్రాగే నీటిలో, తినే ఆహారంలో, మైక్రోప్లాస్టిక్‌లు ప్రతిచోటా ఉన్నాయి. మానవ రక్తం, ఊపిరితిత్తులు, మెదడులో కూడా ఇలాంటి చిన్న ప్లాస్టిక్ ముక్కలను పరిశోధకులు కనుగొన్నారు. ఇది నేటి మానవ జీవితాలకు ముప్పు కలిగించేంతగా వ్యాపించింది. కాబట్టి వాటిని పూర్తిగా నివారించడం ఆచరణాత్మకంగా సాధ్యంకాకపోయినా.. మనం తీసుకునే కొన్ని జాగ్రత్తల వల్ల ఆ మొత్తాన్ని బాగా తగ్గించవచ్చు. ఎలాగంటే..
మైక్రోప్లాస్టిక్ అంటే ఏమిటి?
ఐదు మిల్లీమీటర్ల కంటే చిన్న పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ ముక్కలను మైక్రోప్లాస్టిక్స్ అంటారు. సాధారణంగా ప్రపంచంలో ఏటా దాదాపు 450 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. ఇవి ఏదో ఒక విధంగా చెత్త యార్డులకు చేరుతున్నాయి. ఇవన్నీ సూర్యకాంతి వల్ల కలిగే కాలానుగుణ మార్పుల కారణంగా వలలు, సీసాలు, ప్లాస్టిక్ సంచులు మొదలైన వస్తువులు చిన్న కణాలుగా విడిపోయి అవి ఆహారం ద్వారా, శ్వాస ద్వారా, గాలిలోని కణాల ద్వారా, సౌందర్య సాధనాల ద్వారా చర్మం ద్వారా వివిధ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి.
దీన్ని ఎలా తగ్గించాలి?
ప్లాస్టిక్ బాటిల్ వాటర్ వినియోగాన్ని తగ్గించాలి
మైక్రోప్లాస్టిక్‌లు సాధారణంగా బాటిల్ వాటర్‌లో కనిపిస్తాయి. ఒక లీటరు బాటిల్ వాటర్‌లో 2,40,000 ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయని నిరూపించబడింది. అవి మానవ కంటికి కనిపించనంత చిన్నవి. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి బదులుగా, ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకోవాలి. వీలైనంత వరకు మీ నీటి వినియోగాన్ని తగ్గించాలి. వీలైనంత వరకు వేడి చేసి ఫిల్టర్ చేసిన నీటిని తాగడానికి ప్రయత్నించాలి.
ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయవద్దు
ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని నిల్వ చేయడం, తినడం ప్రమాదకరం. పరిశోధనలో తేలింది ఏమిటంటే.. వేడెక్కిన ప్లాస్టిక్ నిమిషాల్లోనే లక్షలాది ప్లాస్టిక్ కణాలను ఆహారంలోకి విడుదల చేస్తుంది. కాబట్టి ఇంట్లో ప్లాస్టిక్ పాత్రల వాడకాన్ని తగ్గించాలి.
టీ బ్యాగులను ఉపయోగించవద్దు
కొంతమంది పరిశోధకులు టీ బ్యాగులతో టీ తయారు చేయకపోవడం బెటర్ అంటున్నారు. ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండానే పెద్ద మొత్తంలో మైక్రోప్లాస్టిక్‌లు మన శరీరంలోకి ప్రవేశిస్తాయని పరిశోధకులు అంటున్నారు.
వీటన్నింటితో పాటు వీలైనంత వరకు ప్యాక్ చేసిన ఆహారాలు, పానీయాలను నివారించడం ద్వారా ప్లాస్టిక్ పదార్థాల వాడకాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. అర్హత కలిగిన వైద్య సలహాకు ఇది ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.








