AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP ECET 2025 Notification: ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) పూర్తి చేసిన విద్యార్థులకు బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈసెట్‌ 2025) నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (APSCHE) విడుదల చేసింది..

AP ECET 2025 Notification: ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
AP ECET 2025
Srilakshmi C
|

Updated on: Mar 10, 2025 | 2:23 PM

Share

అమరావతి, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్‌, బీఫార్మసీ కోర్సు ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈసెట్‌ 2025) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (APSCHE) షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈసెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఏపీ ఈసెట్‌ ఛైర్మన్‌, అనంతపురం జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు, కన్వీనర్‌ ప్రొఫెసర్‌ భానుమూర్తి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్‌ 7, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.

ఇక మే 6వ తేదీన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో ఉంటుంది. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇక ఈసెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలు, వయోపరిమితి, ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు గడువు వంటి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు. మొత్తం వివరాలతో కూడి పూర్తి నోటిఫికేషన్‌ మార్చి 10వ తేదీన విడులద చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.

కాగా ఏపీ ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు, బీఎస్సీ (మ్యాథమేటిక్స్‌) పూర్తి చేసిన విద్యార్థులకు బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, బయో టెక్నాలజీ, సెరామిక్‌ టెక్నాలజీ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెటలర్జికల్‌, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు పరీక్షలు జరుగుతాయి. ఇక ఈ ఏడాది కూడా ఏపీ ఈసెట్‌ 2025 పరీక్షను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ అనంతపురం నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై