AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Night Shift Work: మీరూ నైట్‌ షిఫ్ట్స్‌ వర్క్‌ చేస్తున్నారా? తగినంత నిద్రలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా..

రాత్రి షిఫ్టులలో పనిచేసే వారి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఇది జలుబు, బ్రోన్కైటిస్, న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇటీవలి పరిశోధన ప్రకారం.. రాత్రి షిఫ్టులలో పనిచేయడం వల్ల నిద్రలేమి పెరుగుతుంది. శరీర పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది..

Night Shift Work: మీరూ నైట్‌ షిఫ్ట్స్‌ వర్క్‌ చేస్తున్నారా? తగినంత నిద్రలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా..
Night Shift Work
Srilakshmi C
|

Updated on: Mar 11, 2025 | 8:58 PM

Share

రాత్రి షిఫ్ట్‌లో పనిచేసేవారు ఎవరైనా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. రాత్రిపూట పనిచేయడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. జలుబు, న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీనివల్ల శరీరం సాధారణ ఇన్ఫెక్షన్లతో కూడా పోరాడే సామర్థ్యం కోల్పోతుంది. నార్వేజియన్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీనివల్ల సైనసిటిస్, బ్రోన్కైటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. రాత్రి షిఫ్టులలో పనిచేసే వారి ఆరోగ్యంపై ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రోనోబయాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో 133 మంది నర్సులు పాల్గొన్నారు.

వారిలో ఎక్కువ మంది మహిళలు. వారి సగటు వయస్సు 41.9 సంవత్సరాలు. వారి నిద్ర వ్యవధి, నిద్ర అవసరాలు, షిఫ్ట్ పని షెడ్యూల్‌లను ఈ అధ్యయనంలో వివరించారు. గత మూడు నెలల్లో తాము ఎదుర్కొన్న ఇన్ఫెక్షన్లను కూడా వారు వివరించారు. నిద్రలేమితో బాధపడేవారికి జలుబు వచ్చే అవకాశం 33 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. నిద్ర లేమి అధికంగా ఉన్నవారికి న్యుమోనియా వంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం 129 శాతం పెరుగుతుందని వీరి అధ్యయనంలో తేలింది.

తీవ్రమైన నిద్రలేమి ఉన్నవారిలో ఈ ప్రమాదం 288 శాతం పెరుగుతుంది. అలాంటి నిద్రలేమి శరీర రోగనిరోధక శక్తిని తగ్గించడమే కాకుండా శరీరం మొత్తం పనితీరును కూడా దెబ్బతీస్తుంది. రాత్రి షిఫ్టులలో పనిచేసే వ్యక్తులు ఇతరులకన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. రాత్రిపూట పని చేయడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల రాత్రిళ్లు పనిచేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే