Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fruits Juice Vs Fruits: తాజా పండ్లు.. పండ్ల జ్యూస్.. బరువు తగ్గేందుకు ఏది మంచిదో తెలుసా?

వేసవిలో ఉపశమనం పొందడానికి చాలా మంది పండ్ల రసాలు, శీతల పానియాలు తాగుతూ సేద తీరుతుంటారు. ముఖ్యంగా కొంతమంది జ్యూసీ పండ్లు తింటారు. మరికొందరు ఇంట్లోనే జ్యూస్ తయారు చేసుకుని తాగుతుంటారు. ఆరోగ్యానికి పండ్లు చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా పండ్ల రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉన్నాయి..

Fruits Juice Vs Fruits: తాజా పండ్లు.. పండ్ల జ్యూస్.. బరువు తగ్గేందుకు ఏది మంచిదో తెలుసా?
Fruit Juice Vs Fruit
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 11, 2025 | 8:40 PM

వేసవి దాదాపు మొదలైనట్లే. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది పండ్ల రసాలు, శీతల పానియాలు తాగుతూ సేద తీరుతుంటారు. కొంతమంది జ్యూసీ పండ్లు తింటారు. మరికొందరు ఇంట్లోనే జ్యూస్ తయారు చేసుకుని తాగుతుంటారు. ముఖ్యంగా ఆరోగ్యానికి పండ్లు చాలా మేలు చేస్తాయి. అంతే కాకుండా పండ్ల రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే బరువు తగ్గాలని భావించే వారికి పండ్లు లేదా పండ్ల రసం ఏది మంచిది? ఈ రెండింటిలో ఏది సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది? అనే సందేహం ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

పండ్లను తినడం వల్ల శరీరానికి పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది. ఇది జీర్ణక్రియ, బరువు నిర్వహణ, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా తాజా పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఆహారంలో క్రమం తప్పకుండా పండ్లను చేర్చుకోవడం వల్ల ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అయితే పండ్లు తినడం వల్ల బరువు సులువుగా తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల, ఈ పండ్లను ఎక్కువగా తినడం ద్వారా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గానికి సహాయపడే పండ్లలో ఆపిల్, బేరి, సిట్రస్ పండ్లు, ద్రాక్ష పండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

పండ్ల రసం వల్ల కలిగే ప్రయోజనాలు

సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పండ్లతో పండ్ల జ్యూస్‌ తయారు చేస్తుంటాం. పండ్లను నేరుగా తినడానికి ప్రత్యామ్నాయంగా జ్యూస్ తాగుతుంటాం. అయితే పండ్లలో ఉన్నంత ఫైబర్ పండ్ల రసంలో ఉండదు. అంతేకాకుండా పండ్లలో కనిపించే అన్ని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు జ్యూస్‌లో కనిపించవు. అందుకే బయట కొనే ప్యాక్ చేసిన జ్యూస్‌లను కొని తాగడం మంచిది కాదు. ఎందుకంటే వాటిలో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడానికి పండ్ల రసం మంచిదేనా?

పండ్ల రసం తాగడం ‘ఆరోగ్యకరమైనది’ అని పరిగణించబడుతున్నప్పటికీ ఇది బరువు తగ్గడానికి సహాయపడదు. అవును.. నేరుగా పండ్లు తినడానికి బదులుగా జ్యూస్‌ తాగడం వల్ల మొత్తం ఎక్కువ కేలరీలు తీసుకోవడం జరుగుతుంది. ఇది బరువు తగ్గడాన్ని సహాయపడటం కంటే అధిక బరువుకు కారణం అవుతుంది. బరువు తగ్గడానికి పండ్లు నేరుగా తినడం మంచి ఎంపిక. అయితే పండ్ల రసం తాగాలని భావిస్తే చక్కెర జోడించని తాజా రసాన్ని మాత్రమే తాగాలి. ఇది మీ ఆరోగ్యానికి మంచిది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన విషయాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.