- Telugu News Photo Gallery Eating sweets and drinking water? Do you know what's happening inside your body?
Sweets and Drinking Water: స్వీట్లు తిన్న తర్వాత మీరూ నీళ్లు తాగుతున్నారా? ఐతే ఇది మీకోసమే..
మనలో చాలా మందికి స్వీట్లంటే బలే ఇష్టం. రసగుల్లా, గులాబ్ జామూన్, జిలేబీ, సందేశ్, మైసూర్ పాక్.. వంటి రకరకాల స్వీట్లు అందరూ ఎంతో ఇష్టం తింటారు. అయితే మనలో చాలా మంది స్వీట్లు తిన్న వెంటనే దాహంగా అనిపించడంతో నీళ్లు తాగుతుంటారు.ఇలా చేయడం దాదాపు మనందరికీ ఉన్న అలవాటు. కానీ మీకు తెలుసా?..
Updated on: Mar 11, 2025 | 8:34 PM

రసగుల్లా, గులాబ్ జామూన్, జిలేబీ, సందేశ్, మైసూర్ పాక్.. వంటి రకరకాల స్వీట్లు అందరూ ఎంతో ఇష్టం తింటారు. అయితే మనలో చాలా మంది స్వీట్లు తిన్న వెంటనే దాహంగా అనిపించడంతో నీళ్లు తాగుతుంటారు.

ఇలా చేయడం దాదాపు మనందరికీ ఉన్న అలవాటు. కానీ మీకు తెలుసా? స్వీట్లు తిన్న తర్వాత ఇలా నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్వీట్లు తిన్న తర్వాత ఖచ్చితంగా నీళ్లు తాగాలని చెబుతున్నారు. ఫలితంగా, శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావుమరీ.

స్వీట్లు త్వరగా తినడం వల్ల శరీరంలో చక్కెర పరిమాణం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది ఒంట్లో చక్కెర పెరుగుదలకు కారణం అవుతుంది. ఈ సమస్య డయాబెటీస్ వంటి చక్కెర సమస్యలతో బాధపడేవారు మాత్రమే కాదు అందరికీ జరుగుతుంది. కాబట్టి స్వీట్లు తిన్న తర్వాత నీరు త్రాగడం వల్ల ఈ చక్కెర స్పైక్ సమస్యను నివారిస్తుంది.

నీరు ఏదైనా ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల తీపి ఆహారాలు సరిగ్గా జీర్ణం కావడానికి నీరు త్రాగటం చాలా ముఖ్యం.

స్వీట్లు తినడం వల్ల దంత బ్యాక్టీరియా మరింత చురుగ్గా మారుతుంది. కాబట్టి నీరు త్రాగడం వల్ల దంతాల్లోని ఆహార పదార్ధాలు క్లీన్ అయ్యి శుభ్రంగా ఉంటుంది. దీంతో దంత ఆరోగ్యం కూడా బాగుంటుంది. చిగుళ్ల నొప్పితో బాధపడేవారు స్వీట్లు తిన్న తర్వాత ఖచ్చితంగా నీళ్లు తాగాలి. లేకపోతే నొప్పి పెరుగుతుంది.





























