Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: ఇదేంది భయ్యా ఇలా చేశావ్‌..? భారీ ఆఫర్‌ను తిరస్కరించిన కేఎల్‌ రాహుల్‌! నిరాశలో ఫ్యాన్స్‌

ఛాంపియన్‌ ట్రోఫీ గెలిచి ఫుల్‌ ఖుషీగా ఉన్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ భారీ ఆఫర్‌ను తిరస్కరించనట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్‌ 2025 సీజన్‌ ఆరంభం కానుంది. ఈ సీజన్‌ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు రాహుల్‌కు ఓ బంపర్‌ ఆఫర్‌ను ఇస్తే.. దాన్ని రాహుల్‌ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ ఆఫర్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

SN Pasha

|

Updated on: Mar 11, 2025 | 11:47 PM

కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌లో పలు టీమ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ముందుగా పంజాబ్ కింగ్స్‌, ఆ తర్వాత లక్నో సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. రాబోయే సీజన్‌లో అతను ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఆడనున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అనుకుంది.

1 / 5
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18 కోసం 9 ఫ్రాంచైజీలు తమ జట్ల కెప్టెన్లను ప్రకటించాయి. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎవరు కెప్టెన్‌గా ఉంటారో ఇంకా వెల్లడి కాలేదు. ఇదిలా ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తన జట్టుకు కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ ఉంటే బాగుటుందని భావించి, ఇదే విషయాన్ని రాహుల్‌కు చెప్తే. రాహుల్‌ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించనట్లు తెలుస్తోంది.

2 / 5
ఢిల్లీ క్యాపిటల్స్ కు వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా మాత్రమే కొనసాగాలని అనుకుంటున్నట్లు, తనకు కెప్టెన్సీ బాధ్యతలు వద్దని రాహుల్‌ ఇప్పటికే స్పష్టం చేసినట్లు సమాచారం. ఆల్రెడీ కెప్టెన్‌గా చేసిన రాహుల్‌కు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని ఢిల్లీ యాజమాన్యం భావిస్తే.. రాహుల్‌ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఇక ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ మరో ప్లేయర్‌ను కెప్టెన్‌గా వెతికే పనిలో ఉంది.

3 / 5
అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ లో ఇద్దరు ప్లేయర్లు కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో అక్షర్ పటేల్ ఒకడు. జట్టులో అతను ఆల్ రౌండర్‌గా ఉన్నాడు. గతంలో కొన్ని మ్యాచ్‌లలో జట్టును నడిపించిన అనుభవం ఉంది. సో అతనికి కెప్టెన్సీ అవకాశం కూడా ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్లో అనుభవజ్ఞుడైన ఫాఫ్ డు ప్లెసిస్ కూడా  ఉన్నాడు. గతంతో డుప్లెసిస్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. మరి వీరిద్దరిలో ఎవరికి కెప్టెన్సీ దక్కుతుందనేది చూడాలి.

4 / 5
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విషయానికి వస్తే..  అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, కెఎల్ రాహుల్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, టి. నటరాజన్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ఫాఫ్ డు ప్లెసిస్, ముఖేష్ కుమార్, దర్శన్ నల్కాండే, విప్రజ్ నిగమ్, దుష్మంత చమీరా, డోనోవన్ ఫెరీరా, అజయ్ మోండల్, మన్వంత్ కుమార్, త్రిపురాణ విజయ్, మాధవ్ తివారీ.

5 / 5
Follow us