Glowing Tips: ఈ బ్యూటీ టిప్స్ పాటిస్తే.. ఉదయం లేచే సరికి ముఖం వెలిగిపోతుంది..

అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందులోనూ యంగ్ ఏజ్‌లో ఉండే ఆడవాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హోమ్ రెమిడీస్, బ్యూటీ పార్లర్, బ్యూటీ ప్రోడెక్ట్స్ ఒక్కటేంటి.. అందాన్ని పెంచేవి ఏమైనా సరే ఉపయోగిస్తారు. అయితే ఎప్పుడూ బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం కంటే.. ఇంట్లో కూడా మనం ముఖాన్ని మెరిపించుకోవచ్చు. పెద్దగా ఖర్చు కూడా ఉండదు. అందులోనూ ఇప్పుడు పండుగల సీజన్. కాబట్టి అందంగా కనిపించాలని..

Glowing Tips: ఈ బ్యూటీ టిప్స్ పాటిస్తే.. ఉదయం లేచే సరికి ముఖం వెలిగిపోతుంది..
Glowing Skin
Follow us

|

Updated on: Sep 06, 2024 | 5:00 PM

అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందులోనూ యంగ్ ఏజ్‌లో ఉండే ఆడవాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హోమ్ రెమిడీస్, బ్యూటీ పార్లర్, బ్యూటీ ప్రోడెక్ట్స్ ఒక్కటేంటి.. అందాన్ని పెంచేవి ఏమైనా సరే ఉపయోగిస్తారు. అయితే ఎప్పుడూ బ్యూటీ పార్లర్స్‌కి వెళ్లి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం కంటే.. ఇంట్లో కూడా మనం ముఖాన్ని మెరిపించుకోవచ్చు. పెద్దగా ఖర్చు కూడా ఉండదు. అందులోనూ ఇప్పుడు పండుగల సీజన్. కాబట్టి అందంగా కనిపించాలని అనుకుంటారు. రెండు, మూడు రోజుల మెరుపును తీసుకొచ్చే ఫేషియల్స్ కంటే.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెరుపును, రంగును పెంచే కొన్ని హోమ్ మేడ్ బ్యూటీ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ టిప్స్ రాత్రి నిద్రపోయే ముందు ట్రై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ట్యానింగ్ చేసుకోండి:

ట్యానింగ్ అంటే.. ముఖంపై ఉండే మురికిని పోగొట్టుకోవడం. ఇందు కోసం మీరు ట్యాన్ రిమూవర్ క్రీమ్స్ బయట మార్కెట్లో ఉంటాయి. అవి తెచ్చుకుని ముఖానికి రాసి రుద్ది క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకు పోయిన మురికి పోతుంది. ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసి పడుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం ఉదయం వరకు మెరుస్తూ కనిపిస్తుంది.

పాలు – రోజ్ వాటర్:

బయట క్రీమ్స్ వద్దు అనుకునేవారు ఇంట్లో కూడా చర్మాన్ని మెరిపించే క్రీమ్స్ ఉన్నాయి. కొద్దిగా పాలలో రోజ్ వాటర్, అలోవెరా జెల్ కలపండి. దీన్ని ఇప్పుడు ముఖానికి పట్టించి.. చేతితో మసాజ్ చేసి.. ఓ పది నిమిషాలు ఆరనివ్వండి. ఇలా చేయడం వల్ల మురికి పోతుంది.

ఇవి కూడా చదవండి

బియ్యం పిండి:

చర్మంపై ఉండే మురికిని వదిలించడంలో బియ్యం పిండి, శనగ పిండి చక్కగా పని చేస్తాయి. ఏదో ఒకటి తీసుకుని ఇందులో కొద్దిగా పెరుగు, టమాటా గుజ్జు కలిపి ముఖానికి అప్లై చేయండి. పది నిమిషాలు ఉంచి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. రాత్రి బాగా నిద్ర పోవాలి. ఇలా చేస్తే ఉదయం వరకు మీ ముఖం మెరిసి పోతుంది.

ముల్తానీ మట్టి:

ముల్తానీ మట్టి కూడా చర్మాన్ని క్లీన్ చేస్తుంది. చర్మంపై ఉండే మురికిని తొలగిస్తుంది. కొద్దిగా ముల్తానీ మట్టి, పాలు, గంధం పొడి, తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. చర్మాన్ని తడి చేసి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి. చేతులు, కాళ్లపై కూడా రాసుకోవచ్చు. ఓ పావుగంట ఉంచి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ బ్యూటీ టిప్స్ పాటిస్తే.. ఉదయం లేచే సరికి ముఖం వెలిగిపోతుంది..
ఈ బ్యూటీ టిప్స్ పాటిస్తే.. ఉదయం లేచే సరికి ముఖం వెలిగిపోతుంది..
సొంతింటి కలను నిజం చేయనున్న జియో
సొంతింటి కలను నిజం చేయనున్న జియో
మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ ఘటనా స్థలిలో కనిపించిన షాకింగ్ దృశ్యాలు..
మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ ఘటనా స్థలిలో కనిపించిన షాకింగ్ దృశ్యాలు..
ఫ్యాటీ లివర్‌ ఉన్న వాళ్లు.. ఈ పండ్లను అస్సలు తీసుకోకూడదు
ఫ్యాటీ లివర్‌ ఉన్న వాళ్లు.. ఈ పండ్లను అస్సలు తీసుకోకూడదు
హెల్త్ పాలసీలు తీసుకునే వారికి షాక్.. ఇకపై ప్రీమియం మరింత భారం!
హెల్త్ పాలసీలు తీసుకునే వారికి షాక్.. ఇకపై ప్రీమియం మరింత భారం!
హోమ్ లోన్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..!
హోమ్ లోన్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..!
లోన్‌యాప్‌ వేధింపులకు విద్యార్ధి బలి.. చెరువులో దూకి సూసైడ్
లోన్‌యాప్‌ వేధింపులకు విద్యార్ధి బలి.. చెరువులో దూకి సూసైడ్
క్రెడిట్ కార్డు బిల్లులు వేధిస్తున్నాయా.?ఆ ఒక్క పని చేస్తే చాలంతే
క్రెడిట్ కార్డు బిల్లులు వేధిస్తున్నాయా.?ఆ ఒక్క పని చేస్తే చాలంతే
డెంగ్యూని లైట్ తీసుకోకండి.. మీ ప్రాణాలు తీసేస్తుంది..
డెంగ్యూని లైట్ తీసుకోకండి.. మీ ప్రాణాలు తీసేస్తుంది..
అమ్మాయిలు చిన్నతనంలో రజస్వల ఎందుకు అవుతున్నారు? నిపుణుల సలహా ఏమిట
అమ్మాయిలు చిన్నతనంలో రజస్వల ఎందుకు అవుతున్నారు? నిపుణుల సలహా ఏమిట