Viral Video: చేయి లేకపోతేనేమి.. ఆత్మవిశ్వాసం ఉందిగా.. ఒంటి చేతితో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతున్న వ్యక్తి..
Viral Video: సోషల్ మీడియాలో హల్ చల్ చేసే కొన్ని వీడియోలు నవ్విస్తే.. మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇంకొన్ని హృదయాన్ని కదిలించేవిగా స్ఫూర్తి నింపేవిగా ఉంటాయి. తాజాగా ఓ వ్యక్తి తనకు..

Viral Video: సోషల్ మీడియాలో హల్ చల్ చేసే కొన్ని వీడియోలు నవ్విస్తే.. మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఇంకొన్ని హృదయాన్ని కదిలించేవిగా స్ఫూర్తి నింపేవిగా ఉంటాయి. తాజాగా ఓ వ్యక్తి తనకు ఉన్న అవయవలోపాన్ని లెక్కచేయకుండా సొంతకాళ్ళమీద నిలబడ్డాడు. స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ.. ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిచాడు. ప్రస్తుతం ఈ వీడియో ని చూసి.. అతని ఆత్మవిశ్వాసం, కృషిని చూసి ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగ్‌పూర్ నగరంలో ఇతని రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ తినడానికి ఆహార ప్రియులు క్యూ కడుతున్నారు.
ఎడమ చేయి లేని స్ట్రీట్ ఫుడ్ విక్రేత తన వృత్తి నైపుణ్యంతో స్టాల్ దగ్గర విన్యాసాలు చేస్తున్నాడు. సింధీ స్టైల్ లో ఫేమస్ డిష్ మసాలేదార్ చోలే ను అమ్ముతాడు. తన వికలాంగ చేతిపై ప్లేట్‌లను ఉంచి ఆహారాన్ని అందిస్తాడు. అమర్ సిరోహి అనే యూట్యూబర్ తన ఛానెల్ లో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో 7 మిలియన్లకు పైగా వ్యూస్, 387k లైక్‌లను సొంతం చేసుకుంది.
సింధీ చోలే రైస్‌తో పాటు, నాగ్‌పూర్‌లోని ప్రముఖ స్ట్రీట్ ఫుడ్ తర్రి పోహాను కూడా విక్రయిస్తాడు. సాంప్రదాయ మసాలా గ్రేవీతో పోహాను .. మసాలెదార్ చోలేతో పోహాతో కలిసి డిఫరెంట్ స్టైల్ లో ఫుడ్ ని అందిస్తాడు. సింధీ చోలే రైస్, చోలే పోహాలను గత 15 సంవత్సరాలుగా నాగ్‌పూర్‌లోని జరీపట్కా ప్రాంతంలో అమ్ముతున్నాడు. ఈరోజుల్లోనే అన్ని అవయవాలున్నవారే అవకాశాలు లేవు.. సరైన ఉద్యోగం లేదు అంటూ అనేక వంకలు చెబుతున్న నేపథ్యంలో తనకు ఓ చేయి లేకపోయినా వ్యాపారం చేస్తూ.. తనకంటూ ఓ పని కల్పించుకున్న ఈ స్ట్రీట్ ఫుడ్ విక్రేత వీడియో ఇంటర్నెట్ లో అనేక మందిని ఆకట్టుకుంది. మనసు పెట్టి పనిచేస్తే.. ఏదైనా సాధ్యమే అని నిరూపించి వ్యక్తి అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: ఫ్రాన్స్‌లో మళ్ళీ కరోనా వైరస్ కల్లోలం..ప్రపంచవ్యాప్తం రోజువారీ అత్యధిక కేసులు నమోదు..