Veg Noodles Pakodi: నూడుల్స్ తో పకోడి ఇలా చేసుకోండి.. టెస్టీనే కాదు.. హెల్తీ కూడా..
చాలామంది రోటిన్‌గా తినే టిఫిన్, స్నాక్స్‌కు భిన్నంగా ఏదైనా డిఫరెంట్‌గా తయారుచేయాలనుకుంటారు. రోజూ తినే పదార్థాలతో బోర్ కొట్టి, కొత్త రకాల కోసం ట్రై చేసేవారు నూడుల్స్ పకోడాను ట్రై చేస్తే రోటిన్‌కు భిన్నంగా ఉండొచ్చు. శీతాకాలంలో..
చాలామంది రోటిన్‌గా తినే టిఫిన్, స్నాక్స్‌కు భిన్నంగా ఏదైనా డిఫరెంట్‌గా తయారుచేయాలనుకుంటారు. రోజూ తినే పదార్థాలతో బోర్ కొట్టి, కొత్త రకాల కోసం ట్రై చేసేవారు నూడుల్స్ పకోడాను ట్రై చేస్తే రోటిన్‌కు భిన్నంగా ఉండొచ్చు. శీతాకాలంలో వేడి వేడి వెజ్ నూడిల్స్ పకోడా తింటే ఆ అనుభూతే వెరబ్బా.. సాధారణంగా రకరకాల పకోడాల గురించి తెలుసు కాని.. నూడుల్స్‌తో పకోడి అంటే కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు. కాని.. మెత్తగా ఉండే నూడుల్స్‌తో కరకరలాడే పకోడిని చేసుకోవచ్చు. పైగా దీనిని హెల్తీగా చేసుకోవడం కోసం కొన్ని రకాల కూరగాయాలను జోడించవచ్చు. మంచి టెస్టీతో పాటు.. చక్కని ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఈ రెసిపి, మిల్లెట్ నూడుల్స్ తీసుకుంటే.. ఇంకా మంచిది. కరకరలాడే నూడుల్స్ పకోడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మిల్లెట్ నూడుల్స్ – 1/2 ప్యాక్
తురిమిన క్యారెట్ – 1
సన్నగా తరిగిన క్యాప్సికమ్ – 1
క్యాబేజి – అర కప్పు
సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 1
సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
శనగ పిండి – 1/2 కప్పు
ఉప్పు – సరిపడినంత
నూనె – డీప్ ఫ్రై కోసం సరిపడినంత
తయారుచేసే విధానం..
వెజ్ నూడిల్ పకోడి తయారు చేయడానికి.. ముందుగా మిల్లెట్ నూడుల్స్ వండుకోవాలి. గిన్నెలో నీళ్లు తీసుకుని స్టవ్ వెలిగించి.. దానిపై గిన్నె పెట్టాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో నూడుల్స్ వేయాలి. కొద్దిగా ఉప్పు వేసి, సగం ఉడికిన తర్వాత.. నీటిని తీసివేసి.. మరింత ఉడకకుండా ఉండటానికి చల్లటి నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి.
తరువాత పెద్ద గిన్నె తీసుకుని.. దానిలో క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీతో పాటు శనగపిండి, ఉప్పు, నూడుల్స్ మసాలా టేస్ట్ మేకర్ వేసి, అన్నింటినీ పొడిగా కలపాలి. ఆ తర్వాత అదే గిన్నెలో ఉడికించిన నూడుల్స్ వేసి.. వాటి జిగటతో.. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. మళ్లీ నీరు వేయకూడదు. నీళ్లు వేస్తే మరింత పలుచగా అయి పకోడి టెస్ట్ పాడయ్యే అవకాశం ఉంటుంది.
అనంతరం పకోడిలను డీప్ ఫ్రై చేయడానికి.. నూనె వేడి చేయాలి. స్టవ్ మీడియంలో ఉంచి.. కలిపిన మిశ్రమాన్ని పకోడీలుగా నూనెలో వేయాలి. అవి బంగారు రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేయండి. అదనపు నూనెను పీల్చుకోవడానికి టిష్యూలు ఉపయోగించాలి. వీటిని గ్రీన్ చట్నీ లేదా సాధారణ టొమాటో సాస్‌తో వేడిగా సర్వ్ చేసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..