Diabetes: మధుమేహన్ని నియంత్రించే సింపుల్ టిప్స్.. ఇలా చేస్తే మీ ఆరోగ్యం పై ఆందోళన అక్కర్లేదు..
ప్రపంచంలో ఎక్కువమంది బాధపడుతూ ఉండే వ్యాధుల్లో మధుమేహం ఒకటి. డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా యువత కూడా ఈ వ్యాధి బారినపడుతున్నారు. షుగర్ వ్యాధి అనేది స్వీట్లు తింటే వచ్చేదనే..
ప్రపంచంలో ఎక్కువమంది బాధపడుతూ ఉండే వ్యాధుల్లో మధుమేహం ఒకటి. డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా యువత కూడా ఈ వ్యాధి బారినపడుతున్నారు. షుగర్ వ్యాధి అనేది స్వీట్లు తింటే వచ్చేదనే అపోహలో కొందరున్నారు. మరికొందరు సెల్ఫ్ మెడికేషన్‌కు పరిమితమవుతున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ డయాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చని, ఇప్పటికే ఉన్నా అది నియంత్రణలో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు తరచుగా హెల్త్ చెక్‌అప్ చేసుకోవడం తప్పనిసరి. మెడికేషన్ ఛేంజ్ చేయాల్సిన అవసరం రావొచ్చు. పాత ప్రిస్క్రిప్షన్ ఆధారంగా లేదా ఇతరులు వాడుతున్న మందుల ఆధారంగా మెడికల్ షాపులో మందులు కొని వాడకూడదు. ఇవి మేలు చేయడం కంటే నష్టం ఎక్కువగా చేస్తాయి. ఇప్పటి వరకు ఉన్న మీ ఆరోగ్య పరీక్షలు, ప్రిస్కిప్షన్లతో ఒక ఫైలు తయారు చేసి పెట్టుకుని డాక్టర్‌ను సందర్శించిన ప్రతిసారి చూపిస్తే.. మీ ఆరోగ్యంపై వైద్యుడికి పూర్తి అవగాహన ఉంటుంది. డయాబెటిక్‌కు సంబంధించి మీకు ఏ మందులు సరిగ్గా పనిచేస్తున్నాయి.. ఏవి పనిచేయడం లేదు అన్న విషయం డాక్టర్ కచ్చితంగా అంచనావేయగలరు.
డైట్ విషయంలో..
షుగర్ ఉన్నవాళ్లు తినే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా నోరూరింపగలిగే ఆహార పదార్థాలను వదిలేయాలి. ఆహారం కల్తీ అయ్యేందుకు ఆస్కారం ఉన్నవాటిని తీసుకోకూడదు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్, స్వీట్లు, కొర్బొనేటెడ్ డ్రింక్స్ జోలికి వెళ్లకూడదు. డైట్‌లో సీజనల్ ఫ్రూట్స్, వెజిటెబుల్స్, సీడ్స్, డెయిరీ ప్రోడక్ట్స్, గింజధాన్యాలు జోడించుకోవడం మంచిది. తగినంత నీరు తాగాలి.
వర్కవుట్స్ తప్పనిసరి
వర్కవుట్స్ తప్పనిసరి. జిమ్‌లో జాయిన్ అవడమో, కఠిన వ్యాయామాలు చేయడమో కాదు. మీరు ఫిట్‌గా ఉండడానికి, వెయిట్ తగ్గించుకోవడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయొచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే శరీరంలో మార్పులు గమనించవచ్చు.
ఆల్కహాల్, స్మోకింగ్‌కు దూరంగా..
ఆల్కహాల్, స్మోకింగ్‌కు గుడ్ బై చెప్పేయండి. బీర్, వైన్, లేక ఏదైనా లిక్కర్ మీరు తీసుకునే అలవాటు ఉంటే దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా వాటిని పక్కన పెట్టేయండి. అవి తాగడం మానేస్తే షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయికి వస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.