Vastu Tips: ఇంట్లో వాటర్ ట్యాంక్ ఈ దిశగా ఉంటే అదృష్టం మీ వెంటే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..!
ఇల్లు కట్టేటప్పుడు గదులు, తలుపులు, కిటికీలు, గృహోపకరణాలు మాత్రమే కాదు, వాటర్ ట్యాంక్ వంటి అవసరమైన వస్తువులు కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. వాస్తు ప్రకారం వస్తువులు నీటి వనరులు కూడా సరైన ప్రదేశంలో ఉంచకపోతే అనుకోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం..నీటిని నిల్వ చేసే ట్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేయాలో తప్పక తెలుసుకోవాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి శక్తి మన జీవితంలోని సుఖ-సమృద్ధి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎంత సంపాదించినా కూడా ఇంట్లో డబ్బు నిలబడటం లేదన్నా, కుటుంబంలో ఎవరో ఒకరూ తరచూగా అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా వాస్తు ప్రభావమే అంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. అంతేకాదు..కారణం లేకుండానే ఇంట్లో కలహాలు, గొడవలు జరుగుతున్నాయంటే కూడా దీనికి ప్రధాన కారణం మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషం కావచ్చు అంటున్నారు నిపుణులు. అవును.. ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు శాస్త్రం ఒక ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. ఇల్లు కట్టేటప్పుడు గదులు, తలుపులు, కిటికీలు, గృహోపకరణాలు మాత్రమే కాదు, వాటర్ ట్యాంక్ వంటి అవసరమైన వస్తువులు కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. వాస్తు ప్రకారం వస్తువులు నీటి వనరులు కూడా సరైన ప్రదేశంలో ఉంచకపోతే అనుకోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం..నీటిని నిల్వ చేసే ట్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేయాలో తప్పక తెలుసుకోవాలి.
వాస్తు ప్రకారం ఇంటికి ఈశాన్యంలో నీటి బావులు, నల్లా, వాటర్ ట్యాంకులు, సంపులు వంటివి ఏర్పాటు చేయటం శుభప్రదం. ఈశాన్యంలో భూమి లోపల నీరు నిల్వ ఉంటం వల్ల ఇంటికి శ్రేయస్కరం. అయితే, ఈశాన్యంలో నీటి నిర్మాణాలు ఏర్పాటు చేసేటప్పుడు తూర్పు, ఉత్తరం వైపు గోడకు తగలకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం మంచిందని నిపుణులు చెబుతున్నారు.. అలాగే ఈ గుంతను సింహద్వారం, ఇంటి ప్రహరీ గోడ గేటుకు ఎదురుగా గానీ ఉండకూడదు.
వాస్తు ప్రకారం నీటి ట్యాంక్‌ను నైరుతి దిశలో ఉంచడం ఇంటికి శుభయోగంగా చెబుతున్నారు. వాటర్ ట్యాంక్ ఏర్పాటుకు నైరుతి దిశ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే, స్థిరత్వానికి ఇది ఉత్తమమైన దిశ. కాబట్టి ఇది అత్యంత అనుకూలమైన దిశగా చెబుతున్నారు. అది కూడా ఇంటి పైకప్పుపై ఎత్తైన ప్రదేశంలో ఉండాలి. ఓవర్ హెడ్ ట్యాంక్ కోసం వాటర్ ట్యాంక్‌ను ఎప్పుడూ నైరుతి దిశలో ఉంచాలి. దీన్ని పైకప్పు నుండి 1-2 అడుగుల ఎత్తులో ఉన్న ప్లాట్‌ఫాంపై ఉంచాలి.
బ్రహ్మస్థానంలో నీటి తొట్టి ఉంచకూడదు. ఇక్కడ ట్యాంక్ ఉంచడం వల్ల వాస్తు దోషాలు వస్తాయి. అలాగే, నీటి ట్యాంక్‌ను ఆగ్నేయ దిశలో ఉంచవద్దు. ఎందుకంటే ఇది అగ్ని దిశ. నీటి మూలకంతో కలిపినప్పుడు ఇది వాస్తు దోషాలను సృష్టించగలదు. ఇకపోతే, వాటర్ ట్యాంక్ నీలం రంగులో ఉంటే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఒకవేళ ఇంటి ఆగ్నేయంలో నుయ్యిలోని నీటిని ఇంటి అవసరాలకు వాడితే, అందులో నివసించే వారికి ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇంట్లో కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి సంబంధాలు దెబ్బతింటాయి. ఎన్నో ఏళ్లుగా కలిసి ఉండేవాళ్లు సైతం శత్రువులుగా మారే ప్రమాదం ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








