Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Using mobile phone in Toilet: బాత్రూంకి ఫోన్‌ తీసుకెళ్తున్నారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్‌లో

ప్రతి ఒక్కరికి వారివారి స్వంత బాత్రూమ్ అలవాట్లు ఉంటాయి. కొందరు వ్యక్తులు బాత్రూంలో కూర్చుని వార్తాపత్రిక లేదా మ్యాగజైన్ చదవడానికి ఇష్టపడతారు. మరికొందరు పాటలు వినడానికి ఇష్టపడతారు. అయితే చాలా మంది బాత్‌రూమ్‌లో కూర్చొని ఫోన్‌లను ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఖాళీ సమయాన్ని వినియోగించుకుంటున్నామని వారు అనుకుంటారు. నిజానికి ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాత్రూంలో ఫోన్ ఉపయోగించడం చాలా ప్రమాదకరం. దీని వల్ల రకరకాల..

Using mobile phone in Toilet: బాత్రూంకి ఫోన్‌ తీసుకెళ్తున్నారా? అయితే మీ ఆరోగ్యం డేంజర్‌లో
Using Mobile Phone In Toilet
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 19, 2023 | 8:27 PM

ప్రతి ఒక్కరికి వారివారి స్వంత బాత్రూమ్ అలవాట్లు ఉంటాయి. కొందరు వ్యక్తులు బాత్రూంలో కూర్చుని వార్తాపత్రిక లేదా మ్యాగజైన్ చదవడానికి ఇష్టపడతారు. మరికొందరు పాటలు వినడానికి ఇష్టపడతారు. అయితే చాలా మంది బాత్‌రూమ్‌లో కూర్చొని ఫోన్‌లను ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఖాళీ సమయాన్ని వినియోగించుకుంటున్నామని వారు అనుకుంటారు. నిజానికి ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాత్రూంలో ఫోన్ ఉపయోగించడం చాలా ప్రమాదకరం. దీని వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

బాత్‌రూమ్‌లో కూర్చొని ఫోన్‌ని ఉపయోగించడం వల్ల పైల్స్‌ వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పైల్స్ ఉన్న విపరీతమైన నొప్పి, కొన్నిసార్లు రక్తస్రావం జరగవచ్చు. పురీషనాళం లేదా పాయువులోని సిరల సమూహాలు ఎర్రబడినప్పుడు ఇది సంభవిస్తుంది. సాధారణంగా, ఇది పురీషనాళంలోని సిరలను ప్రభావితం చేసే ఒక రకమైన ‘వేరికోస్ వెయిన్’ వ్యాధి. మలద్వారం లోపల లేదా వెలుపల హేమోరాయిడ్లు సంభవించే అవకాశం కూడా ఉంది. ఏ ఇంట్లోనైనా టాయిలెట్ అంటే మామూలు గదిలా శుభ్రంగా ఉండదు. బాత్రూంలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బాత్‌రూమ్‌లో కూర్చుని ఫోన్‌ని ఉపయోగిస్తే బాత్‌రూమ్‌లో ఉండే బ్యాక్టీరియా మీ ఫోన్‌కి అంటుకుంటుంది. ఆ తర్వాత ఫోన్ నుంచి బ్యాక్టీరియా నోటి ద్వారా ఇతర మార్గాల్లో సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల ఎలాంటి వ్యాధులైనా సులభంగా వ్యాపిస్తాయి.

మరైతే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారా? అందుకు ఒకటే మార్గం.. బాత్‌రూమ్‌కి వెళ్లేటప్పుడు ఫోన్ తీసుకెళ్లకుండా ఉండటం చాలా అవసరం. దీనివల్ల పైల్స్ వచ్చే అవకాశాలు తగ్గడమే కాకుండా బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు కూడా తగ్గుతాయి. అలాగే మీ ఇంట్లో వెస్ట్రన్ టాయిలెట్ ఉంటే, సీటుపై కూర్చున్నప్పుడు పాదాల కింద స్టూల్‌ పెట్టుకోండి. ఇది మీరు కూర్చునే స్థితిని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.