AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulasi Leaves: తులసి దళాలు నమలవద్దు అనే ఆధ్యాత్మిక నమ్మకం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే

తులసి అధ్యత్మికంగానే కాదు ఆయుర్వేదంలో కూడా ప్రముఖ స్థానం ఉంది. తులసిలో అనేక ఔషధ గుణాలున్నాయి. దీంతో చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను నములుతారు. అయితే ఇలా చేయడం తప్పు. దంతాలు తులసి ఆకును తాకకూడదు. ఎందుకంటే ఇది చెడు రసాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే తులసి నమలడానికి బదులుగా.. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం తులసిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

Tulasi Leaves: తులసి దళాలు నమలవద్దు అనే ఆధ్యాత్మిక నమ్మకం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే
హిందూ మత విశ్వాసాల ప్రకారం, తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. హిందూ మతంలో తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా ఆరాధిస్తారు. హిందూ మతాన్ని విశ్వసించే ప్రతి ఇంట్లో తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. వాస్తు ప్రకారం, ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో తులసీ మొక్కను పెంచటం చాలా శుభప్రదంగా భావిస్తారు. తులసి ఆ మహా విష్ణువు, తల్లి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తారని విశ్వాసిస్తారు. అంతేకాదు.. తులసి మొక్క మతపరమైన ప్రాముఖ్యతను మాత్రమే కాదు మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
Surya Kala
|

Updated on: Jun 02, 2025 | 6:49 PM

Share

తులసి అన్ని వ్యాధులకు మందు. ఇది శారీరకంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఆధ్యాత్మికంగానే కాదు.. సైన్స్ దృక్కోణంలో కూడా తులసి మంచిది. తులసి పూజ వల్ల ఇంట్లో శాంతి, ఆనందం నెలకొంటాయి. అంతేకాదు తులసి ఆకులు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. పిల్లలకు జలుబు, జ్వరం వచ్చినప్పుడు తులసి ఆకులను కషాయం రూపంలో ఇస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది. అందువల్ల తులసి ఆకులను ఉదయం ఖాళీ కడుపుతో తింటారు. అయితే ఈ అలవాటు వాస్తవంగా ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు. వాస్తవంగా తులసి దళాలు ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. వీటిని నేరుగా దంతాలతో నమలడం మాత్రం మంచిది కాదు. తులసిని నమిలి తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఈ రోజు తులసి ఆకులను నేరుగా ఎందుకు నమల కూడదు? ఆరోగ్యం కోసం తులసి ఆకులను ఎలా తీసుకోవాలి తెలుసుకుందాం..

తులసి ఆకులను ఎందుకు నమలకూడదు?

  1. తులసి ఆకులు పాదరసం వంటి అంశాలను కలిగి ఉన్నాయి. కనుక వీటిని నోట్లో వేసుకుని నేరుగా దంతాలతో నమలడం నోటి ఆరోగ్యానికి హానికరం.
  2. ప్రతిరోజూ తులసిని నమలడం ప్రారంభించినప్పుడు.. ఈ అలవాటు నెమ్మదిగా దంతాల ఎనామిల్‌ను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. క్రమంగా దంతాలు సున్నితంగా మారుతాయి. దంతాలు బలహీనం అవుతాయి.
  3. అలాగే తులసి ఆకుల తేలికపాటి ఘాటు నోటిలో చికాకు, పుండ్లను కలిగిస్తుంది.

తులసి ఆకులను ఎలా తీసుకోవాలంటే

  1. తులసి ఆకులను నమలడానికి బదులుగా.. తులసి ఆకులతో కషాయాలను లేదా తులసి ఆకుల సారాన్ని త్రాగాలి.
  2. తులసి ఆకులను నీటి నానబెట్టి తేనె కలిపి కూడా తినవచ్చు. ఇలా చేయడం వలన దంతాలకు హాని కలగదు. పైగా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.
  3. తులసి మొక్క హిందువులకు పవిత్రమైన మొక్క. కనుక తులసి దళాలను కోసేందుకు కూడా కొన్ని నియమలున్నాయి. ఎప్పుడు బడితే అప్పుడు ఎలా బడితే అలా తులసి వినియోగం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది.
  4. తులసిని నమలడం కంటే, తులసి ఆకులను నీటిలో వేసుకుని తాగడం మంచిది. తులసిని నేరుగా పళ్ళతో కొరికరాదు అని హిందువుల నమ్మకం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)