AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel in Bengaluru: బెంగుళూరు వెళ్తున్నారా.. సమీపంలో బెస్ట్ పర్యాటక ప్రాంతాల్లో ఓ లుక్ వేయండి..

బెంగళూరుకి ఏదైనా పనిమీద వెళ్ళినా.. సరదాగా పర్యటన కోసం వెళ్ళినా సమీపంలోని ఏదైనా అందమైన ప్రదేశాలను సందర్శించాలని ఆలోచిస్తున్నారా.. తక్కువ సమయంలోనే వెళ్లేందుకు అందమైన ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశాలు బెంగళూరు నుంచి సుమారు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జన సమూహానికి దూరంగా ప్రశాంతంగా అక్కడ గడవచ్చు..

Travel in Bengaluru: బెంగుళూరు వెళ్తున్నారా.. సమీపంలో బెస్ట్ పర్యాటక ప్రాంతాల్లో ఓ లుక్ వేయండి..
Best Places In Bangalore
Surya Kala
|

Updated on: Jun 02, 2025 | 5:03 PM

Share

దేశంలో గ్రీన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో ఒకటి. పచ్చదనంతో పాటు ఐటీ హబ్ గా పేరుగాంచిన ఈ నగరంలోకి ఏదైనా పని మీద.. లేదా ఫ్యామిలీ తో కలిసి వెళ్ళినా చూసేందుకు అనేక అందమైన ప్రదేశాలున్నాయి. సెలవులను ఆస్వాదించడానికి మీ కుటుంబంతో లేదా స్నేహితులతో సందర్శించడానికి నగరంలో బెంగళూరు ప్యాలెస్, లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్ , ఉల్సూర్ సరస్సు వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి. అయితే నగరంలో మాత్రమే కాదు తక్కువ దూరంలో అంటే సుమారు 100 కి.మీ దూరంలో కూడా చూసేందుకు అందమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. రణగొణధ్వనుల నుంచి ఉపశమనం ఇచ్చే ఈ అందమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ జనసమూహానికి దూరంగా ప్రశాంతంగా సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. అంతేకాదు ఇక్కడి సహజ దృశ్యాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రకృతిలో గడపడం ఇష్టమైన వారు.. ఫోటోగ్రఫీ అంటే ఇష్టపదేవారికి ఈ ప్రదేశాలు సరైన ఎంపిక.

నంది కొండలు నంది హిల్స్ బెంగళూరు నుంచి సుమారు 60 కి.మీ దూరంలో ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవడానికి గంట నుంచి 2 గంటలు పట్టవచ్చు. దీని చరిత్ర కారణంగా ఇది చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఈ నంది కొండలు క్కబల్లాపూర్ రైల్వే స్టేషన్ సమీప రైల్వే స్టేషన్ కి సుమారు 9 కి.మీ దూరంలో ఉన్నాయి. ఇక్కడ ప్రకృతిలోని అందమైన దృశ్యాలను చూడవచ్చు. ఉదయం 6 నుంచి 6:30 మధ్య సూర్యోదయం చూసేందుకు ఒక అద్భుతమైన దృశ్యం అని చెబుతారు. దేవనహళ్లి కోటను, భోగనందీశ్వర ఆలయాన్ని సందర్శించవచ్చు.

స్కందగిరి స్కందగిరి చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం. బెంగళూరు నుంచి 62 కి.మీ దూరంలో ఉంది. ట్రెక్కింగ్ ఇష్టపడే వారు ఇక్కడికి వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రశాంతంగా సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. దీనితో పాటు ఇక్కడ సూర్యోదయాన్ని చూసే అవకాశాన్ని అసలు మిస్ అవ్వొద్దు. సాహస కార్యకలాపాలును ఇష్టపదేవారికి మంచి ప్రదేశం ఇది. స్కందగిరి కొండల పై శివునికి అంకితం చేయబడిన ఒక ఆలయం కూడా ఉంది. ఇక్కడ శివుడిని దర్శనం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

చుంచి జలపాతాలు బెంగళూరు నుంచి దాదాపు 80 నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి చుంచి జలపాతాలు. కర్ణాటకలోని కనకపుర నుంచి మేకెదాతు .. నుంచి సంగం వెళ్ళే మార్గంలో ఈ జలపాతం ఉంది. ఒక చెంచు మహిళ పేరుతో ఈ జలపాతాన్ని పిలుస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలు ప్రకృతి ప్రేమికుల మనసును దోచుకుంటాయి. ఇది ఒక అద్భుతమైన పిక్నిక్ స్పాట్. అంతేకాదు ఇక్కడ సూర్యాస్తమయ దృశ్యం చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఒక మధురమైన జ్ఞాపకం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..