AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ వస్తువులు పెడితే కష్టాలను మీరు కోరి తెచ్చుకున్నట్లే.. ఎందుకంటే

హిందూ మతంలో ఇల్లు కట్టుకోవడం అత్యంత శుభప్రదమైన కార్యక్రమం. అందుకనే పెద్దలు ఇల్లు కట్టుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాదు.. ఇంటిలో పెట్టుకునే వస్తువులు.. ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కల దగ్గర నుంచి ప్రతి విషయం వాస్తు పేర్కొంది. అదే విధంగా ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోవాల్సిన వస్తువులను కూడా వాస్తు పేర్కొంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉండకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి ఏమిటంటే..

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ వస్తువులు పెడితే కష్టాలను మీరు కోరి తెచ్చుకున్నట్లే.. ఎందుకంటే
Vastu Tips For Home
Surya Kala
|

Updated on: Jun 02, 2025 | 3:37 PM

Share

పెద్ద గొప్ప అనే తేడా లేదు ప్రతి ఒక్కరికీ తమకంటూ సొంత ఇల్లు ఉండాలని కోరిక ఉంటుంది. ఇల్లు కట్టుకోవడం ఒక కల. అటువంటి కలను నెరవేర్చుకున్న వ్యక్తి తన ఇంట్లో సుఖ శాంతులతో నివసించాలని కోరుకుంటారు. తన కుటుంబ సభ్యులతో ఆనందంగా సొంత ఇంట్లో జీవించాలని భావిస్తారు. అయితే ఇవన్నీ జరగాలంటే ఇల్లు వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి. ఇంటిలో వస్తువుల విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని అనుసరించాలి. ఇల్లు ఎలా ఉండాలి? అది ఏ దిశలో ఉండాలి? వాస్తు శాస్త్రంలో దీని కోసం అనేక నియమాలు ఇవ్వబడ్డాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎప్పుడూ ఉండకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంటే ఆ ఇంట్లో నివసించే వ్యక్తుల పురోగతికి ఆటంకం కలిగిస్తాయి.

చెత్త డబ్బా

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు చెత్తబుట్ట ఉండకూడదు. లేదా చెత్తను అక్కడ పోగుచేయ రాదు. ఇంటి ముందు మురికి ఉంటే.. ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ ప్రతికూల శక్తి మీ పురోగతిని అడ్డుకుంటుంది. దీని వలన ఆ ఇంట్లో నివసించేవారికి ఆర్థిక నష్టం జరగవచ్చు.

ఇవి కూడా చదవండి

ముళ్ళ చెట్లు, మొక్కలు

టి ప్రధాన ద్వారం ముందు చెట్లు .. మొక్కలు ఉంటే.. ముఖ్యంగా ముళ్ళ మొక్కలు ఉంటే అది అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అవి మీ పురోగతికి అడ్డంకిగా పరిగణించబడతాయి. అందుకే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఎటువంటి ముళ్ళ చెట్టు లేదా ముళ్ళ మొక్క ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

బురద

ఇంటి ప్రధాన ద్వారం ముందు బురద లేదా చిత్తడి నేల ఉండకూడదు. ఎందుకంటే ఇలా ఉండడం వలన ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు.

విద్యుత్ స్తంభాలు

ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభాలు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు విద్యుత్ స్తంభం ఉంటే.. ఆ ఇంట్లో నివసించే వ్యక్తుల మధ్య తగాదాలు ఏర్పడతాయని.. తరచుగా వాదనలు జరుగుతాయని నమ్మకం.

పగిలిన అద్దాలు, వస్తువులు 

ఇంటి ప్రధాన ద్వారం ముందు పగిలిన అద్దాలు, విరిగిన , చిరిగిన ఫర్నిచర్ లేదా అరిగిపోయిన గాడ్జెట్‌లు పెట్టవద్దు. ఎందుకంటే ఇవి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. స్తబ్దత భావనను సృష్టిస్తాయి.

బూట్లు, చెప్పులు

ప్రధాన ద్వారం దగ్గర లేదా ఎదురుగా బూట్లు, చెప్పులు పెట్టుకోరాదు. విడవరాదు. ఇవి ప్రవేశ ద్వారానికి అడ్డుపడతాయి. అవాంఛిత శక్తులను ఆకర్షిస్తాయని నమ్మకం. 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..