Badrinath: బద్రీనాథుడి పూజలో వేటిని సమర్పిస్తారో తెలుసా..! ఇవి లేని బద్రీనాథ్ పూజ అసంపూర్ణం ఎందుకంటే..
స్కంద పురాణం, పద్మ పురాణంలో ఛార్ ధామ్ యాత్రలో చివరిదైన బద్రినాథ్ గురించి వర్ణించబడింది. స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలున్నా ఈ క్షేత్రం వంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదని పురాణాలూ పేర్కొన్నాయి. శ్రీ మహా విష్ణువు తపస్సు చేసిన ఈ క్షేత్రం..ఇక్కడ శ్రీమన్నారాయణుడు బద్రీనాథుడు పూజలను అందుకుంటున్నారు. బద్రీనాథ్ విష్ణు నివాసంగా.. భూలోక వైకుఠం గా ప్రసిద్దిగాంచింది. ఇక్కడ బద్రీనాథుడుకి సమర్పించే పువ్వు ఏమిటి? దాని విశిష్ట ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Jun 02, 2025 | 3:14 PM

బద్రీనాథ్ క్షేత్రాన్ని మన పురాణాలలో బద్రీ లేక బద్రికాశ్రమంగా వర్ణించారు. ఇది ఇలలో ఉన్న వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. అర్జునుడు నరుడుగా.. కృష్ణుడు నారాయణుడిగా ఆశ్రమజీవితం గడిపిన ప్రదేశం. ఇక్కడ శ్రీ మహా విష్ణువుని బద్రీనాథ్ రూపంలో పూజిస్తారు. ఇక్కడ విష్ణువు స్వయంగా సృష్టించిన శాలిగ్రామ విగ్రహం ఉంది. ఇదే బద్రినాథుడు.

బద్రీనాథ్ ధామ్ ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో అలకనంద నది ఒడ్డున నార, నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది. బద్రీనాథ్ ధామ్‌లో ప్రధానంగా తులసి దళాలను, బ్రహ్మకమల పువ్వులను విష్ణువుకు సమర్పిస్తారు.

భారత దేశంలో 108 దివ్య క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో బద్రీనాథ్ కూడా ఒకటి. ఇక్కడ వెలసిన బద్రినాథుడిని పూజలో తులసీ దళాలను ఉపయోగిస్తారు. స్వామికి ఎన్ని రాకల పువ్వులు, ఎంత గొప్పగా పూజలు చేసినా సంతోష పడదని.. తులసి దళంతో పూజ చేసే సతోషపడతాడని నమ్మకం. తులసి లేని విష్ణువు పూజ సంపూర్ణం కనుక.. విష్ణు స్వరూపమైన బద్రీనాథ్ కి కూడా పూజలో తులసి దళం తప్పని సరి.

పురాణాల ప్రకారం విష్ణువు ధర్మధ్వజుని కుమార్తె బృందకు కలియుగంలో తులసి రూపంలో ఆమెను స్వీకరిస్తానని వాగ్దానం చేశాడు. బద్రీనాథ్ ప్రాంతంలో ఒక ప్రత్యేక రకమైన తులసి లభిస్తుంది. దీనిని బద్రీ తులసి అని పిలుస్తారు, దీనిని లక్ష్మీ దేవి రూపంగా భావిస్తారు. ఈ బద్రీ తులసిని బద్రీనాథ్ పూజలో ఉపయోగిస్తారు.

అంతేకాదు బద్రినాథుడి బ్రహ్మకమలం పువ్వులను కూడా సమర్పిస్తారు. ఈ బ్రహ్మ కమలం అనేది హిమాలయాలలోని ఎత్తైన ప్రాంతాలలో పెరిగే అరుదైన , సున్నితమైన పువ్వు. ఇది హిందూ మతంలో పవిత్రమైన పుష్పంగా పరిగణించబడుతుంది. ఈ పువ్వు శ్రీ మహా విష్ణువు.. అతని వివిధ అవతారాలతో ముడిపడి ఉంటుంది.

కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయంలోని విగ్రహాలకు బ్రహ్మ కమలం సమర్పిస్తారు. ఈ పుష్పాన్ని విష్ణువు దైవిక కృపకు చిహ్నంగా భావిస్తారు. కనుక బద్రీనాథ్ ధామ్‌తో పాటు కేదార్‌నాథ్ ధామ్‌లో బ్రహ్మ కమలం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.




