AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchamukhi Anjaneya: పంచ ముఖి ఆంజనేయస్వామిని ఇలా పూజించండి.. అపజయం అన్న మాట మీ డిక్షనరీలోనే ఉండదు..

కేసరి అంజనాదేవి దంపతులకు వాయుదేవుని వరప్రసాదం వల్ల శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు జన్మించాడు. కనుక ఆంజనేయుడిని, పవనపుత్రుడు, వాయుపుత్రుడు అని పిలుస్తారు. రామ భక్తుల్లో అగ్ర గ్రన్యుడైన ఆంజనేయస్వామి తన రామ చంద్ర ప్రభువుని, లక్ష్మణుడిని మహిరావణుడు నుంచి రక్షించేందుకు పంచముఖి అవతారం దాల్చాడు. హనుమంతుని ఐదు ముఖాలు పంచ భూతాలను, ఐదు దిశలను సూచిస్తాయని చెబుతారు. ఇంట్లో పంచముఖి ఆంజనేయుడి ఫోటో లేదా విగ్రహం పెట్టుకోవచ్చా లేదా తెలుసుకుందాం..

Panchamukhi Anjaneya: పంచ ముఖి ఆంజనేయస్వామిని ఇలా పూజించండి.. అపజయం అన్న మాట మీ డిక్షనరీలోనే ఉండదు..
Panchamukhi Anjaneya
Surya Kala
|

Updated on: Jun 02, 2025 | 6:12 PM

Share

హిందూ మతంలో ఆంజనేయుడిని బలం, తెలివితేటలు, భక్తికి చిహ్నంగా పూజిస్తారు. ఆంజనేయ స్వామి రూపాలలో ఒకటి పంచముఖి హనుమంతుడు. ఐదు విభిన్న ముఖాలు కలిగిన హనుమంతుడి రూపం. పాతాళంలో దాచిన రామ లక్ష్మణులను విడిపించేందుకు మహిరావణుడు వధించేందుకు ఆంజనేయ స్వామి దాల్చిన రూపం పంచముఖి ఆంజనేయ స్వామి. ఈ స్వామి పూజ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఎలా పూజించాలో తెలుసుకుందాం..

ఆంజనేయుడికి ఐదు ముఖాలు ఉండటం అతని అసాధారణతను సూచిస్తుంది. ఈ ఐదు ముఖాలు హనుమంతుడు, నరసింహ, వరాహ, హయగ్రీవ, గరుడ. ప్రతి ముఖం విభిన్న లక్షణాలను సూచిస్తుంది. హనుమంతుడు తెలివితేటలు, చాకచక్యానికి ప్రతీక, నరసింహుడు ధైర్యం, పరాక్రమానికి ప్రతీక, వరాహుడు ధైర్యాన్ని, హయగ్రీవుడు జ్ఞానం , అభ్యాసానికి ప్రతీక. గరుడుడు ఎనిమిది సుగుణాలను ప్రసాదిస్తాడని అంటారు.

పంచముఖి ఆంజనేయుని ఐదు ముఖాలు పంచ భూతాలను, ఐదు దిక్కులను సూచిస్తాయని చెబుతారు. పురాణాల ప్రకారం హనుమంతుడు పాతాళంలోని మహిరావణం చేర నుంచి రాముడు, లక్ష్మణులను విడిపించడానికి ఆంజనేయుడు పంచభూతాలను అంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశము, భూమిని తనయందు నిక్షిప్తము చేసికొని ఐదు ముఖాలతో పంచముఖ ఆంజనేయునిగా అవతారమెత్తెను.తూర్పుముఖముగా ఆంజనేయుడు, దక్షిణ ముఖముగా సింహం ముఖం , పశ్చిమ ముఖముగా గరుడుని ముఖం, ఉత్తర దిశగా వరాహావతారం, ఊర్ధ్వ దిశగా హయగ్రీవముఖం కలిగి ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ పంచ ముఖి ఆంజనేయుడిని పూజించడం వల్ల తెలివితేటలు, బలం, ధైర్యం , మనోధైర్యం పెరుగుతాయని నమ్ముతారు. ఐదు ముఖాలు కలిగిన హనుమంతుడి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.

అంతేకాదు శని, మంగళవారాల్లో పంచ ముఖి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు