2022 Year End tour: వచ్చే ఏడాదిని అందమైన ప్రదేశాలలో ప్రారంభించాలనుకుంటున్నారా..? అయితే మీకు ఆహ్వానం పలుకుతున్న ఈ 5 ప్రదేశాల గురించి తెలుసుకోండి..

ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగిసిపోతుంది. ఏడాది చివరి నెల రావడమే ఆలస్యం అన్నట్లుగా అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. మీరు కూడా పాత..

2022 Year End tour: వచ్చే ఏడాదిని అందమైన ప్రదేశాలలో ప్రారంభించాలనుకుంటున్నారా..? అయితే మీకు ఆహ్వానం పలుకుతున్న ఈ 5 ప్రదేశాల గురించి తెలుసుకోండి..
Follow us

|

Updated on: Dec 05, 2022 | 7:56 PM

ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగిసిపోతుంది. ఏడాది చివరి నెల రావడమే ఆలస్యం అన్నట్లుగా అందరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. మీరు కూడా పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని ప్రత్యేకంగా స్వాగతించాలని కోరుకుంకుంటున్నారా..? అయితే అందుకు ఎక్కడికైనా టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి. ఏడాది ముగింపులో టూర్లకు వెళ్లడం వల్ల వచ్చే ఏడాదిని ఉల్లాసంగా ప్రారంభించవచ్చు. ఇంకా మీకు కూడా ఉద్యోగ జీవితానికి కొంత విశ్రాంతి ఇచ్చినట్లు ఉంటుంది.

తద్వారా మీ మనసు కూడా చురుకుగా ఉంటుంది. అలా టూర్ వెళ్లాలనుకుంటే.. ఆహారం నుంచి అందం పోకడల వరకు అనేక అంశాలను గుర్తుంచుకొని ప్లాన్ చేసుకోండి. అలాంటి ప్రదేశాల గురించి మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం. రాబోయే కొత్త సంవత్సరాదిని మంచి ప్రదేశంలో చేసుకోవాలనుకుంటే, 2022 సంవత్సరంలో ప్రసిద్ధి పొందిన ఈ ప్రదేశాలకు వెళ్లవచ్చు.

గోవా..

దేశంలోని ప్రతి ఒక్కరూ సందర్శించాలనుకునే ప్రదేశాలలో గోవా తప్పకుండా ఉంటుంది. దేశంలోని ప్రముఖ వెకేషన్ డెస్టినేషన్‌లలో గోవా మొదటి స్థానంలో ఉండటానికి ఇదే కారణం. అందమైన సముద్ర తీరం ఉన్న ఈ నగరం దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా ప్రసిద్ధి. మీరు కూడా గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. అగుడా ఫోర్ట్, ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్‌తో పాటు పలోలెం బీచ్, దూద్‌సాగర్ జలపాతం, బాగా బీచ్, అంజునా బీచ్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.

ఇవి కూడా చదవండి

దక్షిణ భారతదేశం ఎల్లప్పుడూ సందర్శించడానికి ప్రత్యేకమైన, అందమైన ప్రదేశం మున్నార్. కేరళలోని చాలా అందమైన ప్రదేశాలలో మున్నార్ కూడా ఒకటి. పలు నివేదికల ప్రకారం చాలా మంది వారి సెలవులను ఈ ప్రదేశంలో గడపడానికి ఇష్టపడుతున్నారట. ఎకో పాయింట్, అటుకాడ్ జలపాతం, ఎరవికులం నేషనల్ పార్క్, టాటా టీ మ్యూజియం, పల్లివాసల్ జలపాతం, రోజ్ గార్డెన్ మరియు కొలుకుమలై టీ ఎస్టేట్ వంటి అనేక ప్రదేశాలు కూడా మున్నార్ లో ఉన్నాయి.