- Telugu News Photo Gallery New year 2023 celebration reach these hill stations to celebrate new year with friends
New Year Celebrations: ఫ్రెండ్స్ తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలనుకుంటున్నారా .. ఈ హిల్ స్టేషన్స్ బెస్ట్ ఎంపిక
మీరు కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. భారత దేశంలో చూడవలసిన కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి మీరు ఈ అందమైన ప్రదేశాలకు కూడా వెళ్ళవచ్చు.
Updated on: Dec 05, 2022 | 12:05 PM

కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త సంవత్సరాన్ని రకరకాలుగా ప్రజలు జరుపుకుంటారు. అయితే కొందరు కొత్త ప్లేస్ కు వెళ్లి తమ న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవలాని భావిస్తారు. అందుకు తగిన ప్లాన్స్ కూడా వేస్తారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి మీరు ఏ హిల్ స్టేషన్లను సందర్శించవచ్చో తెలుసుకుందాం.

ముస్సూరీ - నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి మీరు ముస్సూరీకి వెళ్లవచ్చు. ఈ ప్రదేశాలను సందర్శించేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. లాల్ దిబ్బా, మాల్ రోడ్, కెంప్టీ ఫాల్, ముస్సోరీ లేక్ వంటి ప్రదేశాలలో మీరు నూతన సంవత్సరాన్ని జరుపుకోవచ్చు.

ఖజ్జియార్ - హిమాచల్ ప్రదేశ్ లోని చంబ ఓ ఒక పర్యాటక ప్రాంతం. ఇది ఒక హిల్ స్టేషన్ చాలా అందంగా ఉంటుంది. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వేలాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఖజ్జియార్‌ను చాలా అందంగా అలంకరిస్తారు. నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి మీరు కూడా ఇక్కడకు వెళ్లవచ్చు.

నైనిటాల్ - నూతన సంవత్సర వేడుకలకు ఫ్రెండ్స్ తో జరుపుకోవడానికి నైనిటాల్‌కు వెళ్లవచ్చు. ఇది కూడా అత్యంత సుందరమైన స్థలం. ప్రకృతి అందాలతో అద్భుతంగ ఉంటుంది. నైని సరస్సు, నైనా దేవి ఆలయం, టిఫిన్ టాప్, స్నో వ్యూ పాయింట్ వంటి ప్రదేశాలను సందర్శించడానికి కూడా ఇక్కడకు వెళ్లవచ్చు.

ఘన్సాలీ - నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి మీరు ఘన్సాలీకి కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ ప్రకృతి అందాలు పర్యటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విభిన్నంగా ఉంటాయి. ఇక్కడ అందమైన లోయలను ఆస్వాదించగలరు. నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం




