Summer Vacation: వేసవి నుంచి ఉపశమనం కోసం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక..

వేడి నుంచి ఉపశమనం పొందే ప్రదేశాన్ని సందర్శించాలని కోరుకుంటారు. భారతదేశంలో వేసవి లో కూడా చల్లదనాన్ని అందించే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. పాఠశాలకు వేసవి సెలవులు వచ్చిన వెంటనే పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. పిల్లలు ఖచ్చితంగా తమ తల్లిదండ్రులను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళమని పట్టుబడతారు. మీరు కూడా ఈ వేసవి సెలవుల్లో మీ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. భారతదేశంలోని ఈ అందమైన ప్రదేశాలపై ఓ లుక్ వేయండి.. 

Summer Vacation: వేసవి నుంచి ఉపశమనం కోసం ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా.. ఈ ప్లేసెస్ బెస్ట్ ఎంపిక..
Summer Vacation Trip
Follow us

|

Updated on: Mar 15, 2024 | 11:57 AM

శీతాకాలం వెళ్లి.. వేసవి కాలం వచ్చేసింది. దీంతో క్రమక్రమంగా మండే ఎండలు మొదలయ్యాయి. మరోవైపు పరీక్షలు పూర్తీ అయ్యి వేసవి సెలవులు ఇచ్చే సమయం వచ్చేస్తోంది. దీంతో చాలా మంది సెలవుల్లో తమ ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. వాస్తవానికి భారతదేశంలోని చాలా నగరాల్లో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా సమయం దొరికిన వెంటనే ప్రజలు కొన్ని రోజులైనా ఎక్కడికైనా వెళ్లాలని..  వేడి నుంచి ఉపశమనం పొందే ప్రదేశాన్ని సందర్శించాలని కోరుకుంటారు. భారతదేశంలో వేసవి లో కూడా చల్లదనాన్ని అందించే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి.

పాఠశాలకు వేసవి సెలవులు వచ్చిన వెంటనే పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. పిల్లలు ఖచ్చితంగా తమ తల్లిదండ్రులను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళమని పట్టుబడతారు. మీరు కూడా ఈ వేసవి సెలవుల్లో మీ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. భారతదేశంలోని ఈ అందమైన ప్రదేశాలపై ఓ లుక్ వేయండి..

ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబై వేసవిలో పర్యటించడానికి బెస్ట్ ఎంపిక. కనుక మండుతున్న వేడి నుంచి  తప్పించుకోవడానికి ముంబై వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉష్ణోగ్రత చాలా వేడిగాఉండదు. అదే సమయంలో వాతావరణం చల్లగా కూడా ఉండదు. భిన్నమైన వాతావరణం కారణంగా పర్యాటకులు ఈ స్థలాన్ని చాలా ఇష్టపడతారు. అంతేకాదు ముంబై చుట్టూ ఉన్న హిల్ స్టేషన్లల్లో కూడా పర్యటించవచ్చు.

ఇవి కూడా చదవండి

కూనూర్: తమిళనాడులోని కూనూర్‌ కూడా వేసవి విడిదికి బెస్ట్ ఎంపిక. నీలగిరి కొండలు, పచ్చని తేయాకు తోటలను చూడవచ్చు. నగర సందడికి దూరంగా కాఫీ, టీ తోటల పచ్చదనం మిమ్మల్ని ఆకర్షిస్తుంది.

తవాంగ్: ఈశాన్య భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న హిల్ స్టేషన్. ఇక్కడ శీతాకాలంలో హిమపాతానికి ప్రసిద్ధి చెందింది. అయితే వేసవి కాలంలో కూడా తవాంగ్ ను సందర్శించవచ్చు. మీకు మంచు కొండలతో పాటు చల్లదనాన్ని ఎంజాయ్ చేయడం అంటే ఇష్టమైతే ఈ ప్రదేశం పర్యాటకులకు స్వర్గం కంటే తక్కువ కాదు.

హర్సిల్: ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ జిల్లాలో ఉన్న హర్సిల్ వ్యాలీ ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. భాగీరథి నది ఒడ్డున ఉన్న హర్సిల్ వ్యాలీ ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

చోప్తా హిల్ స్టేషన్: ఉత్తరాఖండ్ లోని చోప్తా నుండి 3.5 కి.మీ దూరంలో తుంగనాథ్ దేవాలయం..  చాలా ప్రసిద్ధి చెందిన హిందువులకు పవిత్ర ప్రదేశం. 3680 మీటర్ల ఎత్తుతో ఈ ఆలయం శివునికి అంకితం చేయబడిన అత్యంత ఎత్తైన ఆలయం దర్శనం ఒక సాహసంతో కుడా యాత్ర అని చెప్పవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..