మేడం సార్ మేడం అంతే.. స్కూటీతో గాల్లో డ్రైవింగ్.. రూఫ్ పార్కింగ్ అంటూ ఫన్నీ కామెంట్స్ ..
అమ్మాయిల డ్రైవింగ్ స్కిల్స్ పై సరదా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంతేకాదు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటూ డ్రైవింగ్‌కు సంబంధించిన ట్రోల్స్, మీమ్స్ ప్రతిరోజూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని విపరీతంగా కనిపిస్తే.. మరి కొన్ని ట్రోల్స్ మనల్ని పెద్దగా నవ్విస్తాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అందులో ఇద్దరు యువతులు స్కూటర్ నడుపుతుండగా.. ఆ స్కూటర్ అదుపు తప్పి నేరుగా ఇంటి పైకప్పుపైకి దూసుకెళ్లింది.
మారిన కాలంతో పాటు యువతుల వేష భాషల్లో జీవన శైలిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. యువకులతో పోటీగా చదువులో ఆట పాటల్లో కూడా ప్రతిభ చూపడమే కాదు.. సైకిల్, బైక్ నుంచి భారీ వాహనాలను కూడా డ్రైవ్ చేస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది యువతుల డ్రైవింగ్ తీరుపై జోకులు తరచుగా వినిపిస్తూనే ఉంటాయి. అమ్మాయిల డ్రైవింగ్ స్కిల్స్ పై సరదా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంతేకాదు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటూ డ్రైవింగ్‌కు సంబంధించిన ట్రోల్స్, మీమ్స్ ప్రతిరోజూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని విపరీతంగా కనిపిస్తే.. మరి కొన్ని ట్రోల్స్ మనల్ని పెద్దగా నవ్విస్తాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అందులో ఇద్దరు యువతులు స్కూటర్ నడుపుతుండగా.. ఆ స్కూటర్ అదుపు తప్పి నేరుగా ఇంటి పైకప్పుపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటన ఫన్నీ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఇద్దరు స్థానిక యువతులు రోడ్డుపై స్కూటర్‌పై వేగంగా వెళ్తుండగా స్కూటర్ బ్రేకులు ఫెయిల్ కావడంతో స్కూటర్ నేరుగా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న ఇంటి పైకప్పుపైకి దూసుకుని వెళ్లింది. దీంతో ఇద్దరు యువతులు స్కూటీతో పాటు ఇంటి పైకప్పులో చిక్కుకున్నారు. ఈ యువతుల స్కూటర్ తో చేసిన సర్కస్ ఫీట్ కు ఇంటి పై కప్పు ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. @infojawabarat అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వీడియో షేర్ చేశారు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:
View this post on Instagram
వైరల్ వీడియోలో ఇద్దరు యువతులు స్కూటర్‌తో పాటు ఇంటి పైకప్పుపై ఇరుక్కుపోయి ఉన్నారు. ఇద్దరు యువతులు వేగంగా స్కూటర్‌పై వస్తుండగా.. వారి స్కూటర్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇంటి పైకప్పుపైకి దూసుకుని వెళ్ళింది. దీంతో స్కూటీతోపాటు ఇద్దరు యువతులు పైకప్పుపైకి వెళ్లి చిక్కుకుని పోయారు. అనంతరం అక్కడి నుంచి కిందకు దిగేందుకు ఇబ్బంది పడుతున్న యువతులకు స్థానికులు సాయం చేశారు. నిచ్చెన సాయంతో కిందకు దించారు.
రెండు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 14.6 మిలియన్ల వ్యూస్, నాలుగు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాదు రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఒకరు “ఇది రూఫ్ పార్కింగ్” అని చమత్కరించారు. మరొకరు దేవుడా ఎలాంటి డ్రైవింగ్ అని వ్యాఖ్యానించారు. ఇంకొకరు బహుశా ఆ యువతి గూగుల్ మ్యాప్స్‌ని చూసి స్కూటీ నడిపి ఉండొచ్చు’’ అని చమత్కరించారు. మరికొందరు డ్రైవింగ్ విషయంలో అమ్మాయిలను నమ్మకూడదని అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..