ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు..! ఇక్కడ ప్రయాణం చాలా డేంజర్..?

Extreme Places: ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రయాణించాలంటే చాలా డేంజర్. ఇక్కడికి పర్యాటకులు వెళ్లాలన్నా చాలా శ్రమతో కూడుకున్నది.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు..! ఇక్కడ ప్రయాణం చాలా డేంజర్..?
Antarctica
Follow us
uppula Raju

|

Updated on: Oct 17, 2021 | 9:50 PM

Extreme Places: ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రయాణించాలంటే చాలా డేంజర్. ఇక్కడికి పర్యాటకులు వెళ్లాలన్నా చాలా శ్రమతో కూడుకున్నది. అంతేకాదు పూర్తి ఆరోగ్యంగా ఉంటే తప్పా సాధ్యం కాదు. అలాంటి కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. ప్రపంచంలో అత్యంత చల్లని ప్రదేశం భూమిపై అతి శీతల ఖండం అంటార్కిటికా. ఇక్కడి వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ఖండంలోని ఉన్న తూర్పు అంటార్కిటిక్ పీఠభూమి అతి శీతల ప్రదేశం. ఇక్కడ 2004, 2016 మధ్య శాటిలైట్ డేటా గాలి ఉష్ణోగ్రతలు -94 °C ఉన్నట్లు చూపించింది.

2. ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతం ప్రపంచంలోని అత్యంత పొడి ప్రదేశం చిలీలోని అటకామా ఎడారి. ఇది భూమిపై అత్యంత పొడి, ఎత్తైన ధ్రువ రహిత ఎడారి. ఇక్కడ ఎన్నో విషయాలను అన్వేషించవచ్చు. ఎడారి సాహసాలకు పెట్టింది పేరు. ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చు.

3. ప్రపంచంలో అత్యంత హాటెస్ట్ ప్రదేశం ప్రపంచంలో అత్యంత హాటెస్ట్ ప్రదేశంగా డెత్ వ్యాలీని చెప్పవచ్చు. ఇది కాలిఫోర్నియాలో ఉంది. ఇక్కడ 134 ° F (57 ° C) కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఈ విషయంపై కొంత చర్చ జరుగుతోంది.

4. ప్రపంచంలో అత్యంత తడి ప్రదేశం ప్రపంచంలో అత్యంత తడి ప్రదేశంగా భారతదేశంలోని మాసిన్‌రామ్‌ అని చెప్పవచ్చు. ఇక్కడ సంవత్సరం మొత్తం వర్షం కురుస్తుంది. ఇది భూ గ్రహం మీద అత్యంత తడి ప్రదేశం. బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన రుతుపవనాలు మాసిన్‌రామ్‌ చుట్టుపక్కల ఉన్న పర్వతాలను తాకినప్పుడు వర్షం కురుస్తుంది.

Sril Lanka: చమురు కొనుగోలుచేయడానికి డబ్బులు లేవు.. భారత్ అప్పు ఇస్తే కొనుక్కుంటాం మంటున్న శ్రీలంక