Statue Of Unity: ఈ రోజులలో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ చూడటానికి అనుమతి లేదు..! ఎందుకంటే..?

Statue Of Unity: గుజరాత్‌లోని నర్మద జిల్లా కేవడియా వద్ద ఉన్న 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' అక్టోబర్ 28 నుంచి నవంబర్1 వరకు మూసివేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ రోజులలో

Statue Of Unity: ఈ రోజులలో 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' చూడటానికి అనుమతి లేదు..! ఎందుకంటే..?
Statue Of Unity
Follow us
uppula Raju

|

Updated on: Oct 17, 2021 | 8:57 PM

Statue Of Unity: గుజరాత్‌లోని నర్మద జిల్లా కేవడియా వద్ద ఉన్న ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అక్టోబర్ 28 నుంచి నవంబర్1 వరకు మూసివేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ రోజులలో సాధారణ పర్యాటకులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి సందర్భంగా జరిగే వేడుకలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వల్లభాయ్ పటేల్ విగ్రహంతో పాటు దానికి సంబంధించిన ఇతర టూరిస్ట్ కేంద్రాలు కూడా మూసివేస్తామని తెలిపారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా జన్మదినమైన అక్టోబర్ 31న కెవాడియాకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత ఏడాది అక్టోబర్ 31న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. 2013, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ పుట్టినరోజు సందర్భంగా నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విగ్రహానికి శంకుస్థాపన చేశారు.

2018 లో ప్రధాని మోదీ ప్రారంభించారు ఐదు సంవత్సరాల తరువాత 31 అక్టోబర్ 2018 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించారు. కేవలం ఒకటిన్నర సంవత్సరాలలో ఈ స్మారక చిహ్నం 120 కోట్లకు పైగా సంపాదించింది. 2018 సంవత్సరంలో ప్రారంభోత్సవం తరువాత ఒక సంవత్సరంలో 24 లక్షల మంది పర్యాటకులు ఈ విగ్రహాన్ని చూశారు. దాదాపు 64 కోట్లు సంపాదించింది. అదే సమయంలో, 2019 సంవత్సరంలో ఈ స్మారక చిహ్నం దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 స్మారక చిహ్నాలలో ఒకటిగా నిలిచింది. 182 మీటర్ల ఎత్తైన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.

Dale Steyn: టీం ఇండియా బౌలింగ్ కోచ్‎గా పని చేయాలనుంది!.. అంతరంగాన్ని బయటపెట్టిన స్టెయిన్..