Dale Steyn: టీం ఇండియా బౌలింగ్ కోచ్‎గా పని చేయాలనుంది!.. అంతరంగాన్ని బయటపెట్టిన స్టెయిన్..

దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ డేల్ స్టెయిన్ భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవ చేయాలని ఉందని తన కోరికను బయట పెట్టాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇన్‎స్టాగ్రామ్ పేజీలో చేసిన పోస్టుకు స్టెయిన్ ఇచ్చిన రిప్లై చూస్తే అతని కోరిక తెలుస్తుంది...

Dale Steyn: టీం ఇండియా బౌలింగ్ కోచ్‎గా పని చేయాలనుంది!.. అంతరంగాన్ని బయటపెట్టిన స్టెయిన్..
Stain
Follow us

|

Updated on: Oct 17, 2021 | 8:37 PM

దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ డేల్ స్టెయిన్ భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవ చేయాలని ఉందని తన కోరికను బయట పెట్టాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇన్‎స్టాగ్రామ్ పేజీలో చేసిన పోస్టుకు స్టెయిన్ ఇచ్చిన రిప్లై చూస్తే అతని కోరిక తెలుస్తుంది. బీసీసీఐ ఎంఎస్ ధోనీని టీ 20 వరల్డ్ కప్‎లో టీం ఇండియాకు మెంటరుగా నియమించింది. ఈ క్రమంలో ధోనీతో ఫోన్ మాట్లడుతుంటే.. అతనికి మీరు ఏం చెబుతారని ఆ ఛానల్ తన ఇన్‎స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన స్టెయిన్ టీం ఇండియా బౌలింగ్ కోచ్‎గా తనను నియమించమని అడుగుతా అని అన్నారు. 93 టెస్టులు ఆడిన స్టెయిన్ 439 వికెట్ల్ తీశాడు. 125 వన్డేల్లో 196 వికెట్ల పడగొట్టాడు. 47 టీ 20ల్లో 64 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 26 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో మూడుసార్లు ఐదు వికెట్లు తీశాడు.

Capture

Capture

ఇది ఇలా ఉండగా.. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం అధికారిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 17 ఆదివారం టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్ట్ కోసం పోటీదారులు తమ దరఖాస్తును బీసీసీఐకి అక్టోబర్ 26 సాయంత్రం 5 గంటలలోపు పంపాలి. అయితే రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా చేయడానికి బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం లాంఛనాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన కోచ్‌తో పాటు, సహాయక సిబ్బందిలో బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ కోసం కూడా దరఖాస్తులు ఆహ్వానించింది.

బీసీసీఐ వివరాల మేరకు, ప్రధాన కోచ్, సహాయక సిబ్బంది పదవీకాలం రెండు సంవత్సరాలు ఉండనుంది. దీనితో పాటు, అర్హత ఉన్న అభ్యర్థి కోసం బోర్డు అనేక షరతులను కూడా విధించింది. దీని ప్రకారం ప్రధాన కోచ్ కోసం దరఖాస్తుదారు కనీసం 30 టెస్ట్ మ్యాచ్‌లు లేదా వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం కలిగి ఉండాలి. ఐసీసీ లిస్టులో ఉన్న దేశాల టీంలకు కోచ్‌గా రెండు సంవత్సరాలు పనిచేసి ఉండాటని పేర్కొంది. లేదా 3 సంవత్సరాల పాటు ఏదైనా అసోసియేట్ టీమ్ లేదా ఐపీఎల్ టీమ్ లేదా ఇతర విదేశీ లీగ్ లేదా ఫస్ట్ క్లాస్ టీమ్ కోచ్‌గానైనా పనిచేసి ఉండాలని పేర్కొంది. లేదా బీసీసీఐ నుంచి లెవల్ -3 సర్టిఫికెట్ (కోచింగ్) పొందాలని తెలిపింది. వీటితోపాటు అపాయింట్‌మెంట్ సమయంలో సంబంధిత వ్యక్తి వయస్సు 60 ఏళ్లలోపు ఉండాలని పేర్కొంది.

Read Also.. T20 World Cup: ఆ దేశం ఇండియాకు గట్టి పోటీనివ్వలేదు.. అలా అని తేలికగా తీసుకోవద్దు..