AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: విరాట్ కోహ్లీ కోసం కప్ గెలవండి.. ఆటగాళ్లకు సురేష్ రైనా సూచన..

యూఏఈ, ఒమన్‌లో జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ తన టీ 20 కెప్టెన్సీ పరిపూర్ణం చేసుకుంటాడని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అన్నారు. ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ టీ 20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడు...

T20 World Cup: విరాట్ కోహ్లీ కోసం కప్ గెలవండి.. ఆటగాళ్లకు సురేష్ రైనా సూచన..
సురేష్ రైనా.. అత్యధిక పరుగులు సాధించడమే కాకుండా జట్టు కష్టాల్లో  అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆదుకున్నాడు. దాదాపు చెన్నై గెలిచిన అన్ని మ్యాచ్‌లలో సురేష్ రైనా రాణించాడు. మొత్తం 3484 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు మూడుసార్లు టైటిల్ గెలుచుకుంది.
Srinivas Chekkilla
|

Updated on: Oct 17, 2021 | 6:47 PM

Share

యూఏఈ, ఒమన్‌లో జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ తన టీ 20 కెప్టెన్సీ పరిపూర్ణం చేసుకుంటాడని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అన్నారు. ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ టీ 20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడు. అక్టోబర్ 24 న దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్లేయర్స్​ సమిష్టిగా రాణించి సారథి కోహ్లీకి ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచ కప్‌ అందించాలని మెసేజ్ ఇచ్చాడు.

యూఏఈలో ఐపీఎల్‌లో పాల్గొన్న భారత ఆటగాళ్లు ప్రపంచ కప్ సమయంలో జట్టుకు సహాయపడగలరని రైనా అభిప్రాయపడ్డాడు. “మా ఆటగాళ్లందరూ యూఏఈలో ఇప్పుడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడారు. వారు ఈ వాతావరణంలో ఎనిమిది, తొమ్మిది మ్యాచ్‎లు ఆడి అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు.” అని అన్నారు. యూఏఈ, ఇండియా, పాక్ వాతావరణ పరిస్థితులు సమానంగా ఉంటాయి. ఇది ఆసియా జట్లకు అనుకూలిస్తుంది. టోర్నమెంట్‌లో భారత విజయానికి ముగ్గురు కీలకమైన బ్యాట్స్‎మెన్స్ ఉన్నారని.. భారత విజయానికి మొదటి మూడు స్థానాల్లో బ్యాటింగ్ దిగే వారు కీలకమని చెప్పాడు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ భారత జట్టకు ముఖ్యమన్నారు. రిషబ్ పంత్ ఇక్కడ కీలక పాత్ర పోషించబోతున్నాడని.. హార్దిక్ పాండ్యా పవర్ హిట్టర్‌గా చాలా సమర్థుడని తెలిపారు.

మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి యూఏఈలోని పిచ్‌ల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని టోర్నమెంట్‌లో భారతదేశానికి కీలక పాత్ర పోషిస్తాడని నమ్ముతున్నట్లు చెప్పాడు ” ఐపీఎల్‌లో నా అనుభవం ఏమిటంటే యూఏఈ, ఒమన్‌లో వికెట్లు చాలా సవాలుగా ఉంటాయి. భారత బౌలింగ్ దాడిలో వరుణ్ చక్రవర్తిని ప్రధాన వ్యక్తిగా భావిస్తున్నాను. వరుణ్ కేవలం మూడు టీ 20లు మాత్రమే ఆడాడని తెలిపారు. పేసర్ల విషయనికొస్తే అనుభవం ఉన్నవారు ఉన్నారు. “ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ అనుభవం ఉపయోగపడుతుంది. శార్దూల్ ఠాకూర్‌ను చేర్చడం వల్ల విరాట్ తన వద్ద ఉన్న ఫాస్ట్ బౌలర్లకు అదనపు బలాన్ని ఇచ్చినట్లయింది” అని అన్నాడు. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి మేటి జట్లు ఉన్నాయన్న విషయం టీమ్​ఇండియా మార్చిపోవద్దన రైనా గుర్తు చేశాడు.

Read Also.. T20 World Cup: ఆ దేశం ఇండియాకు గట్టి పోటీనివ్వలేదు.. అలా అని తేలికగా తీసుకోవద్దు..