Personal Loan: పర్స్‌నల్‌ లోన్‌పై ఏ బ్యాంకు తక్కువ వడ్డీ వసూలు చేస్తుంది..! తెలుసుకోండి..

Personal Loan: అత్యవసరంగా డబ్బు కావాలంటే మొదటగా గుర్తుకువచ్చేది పర్స్‌నల్‌ లోన్. అంతేకాక అధిక వడ్డీకి రుణం తీసుకోవడం కంటే మీకు ఖాతా ఉన్న బ్యాంక్ నుంచి

Personal Loan: పర్స్‌నల్‌ లోన్‌పై ఏ బ్యాంకు తక్కువ వడ్డీ వసూలు చేస్తుంది..! తెలుసుకోండి..
Loan
Follow us
uppula Raju

|

Updated on: Oct 17, 2021 | 9:45 PM

Personal Loan: అత్యవసరంగా డబ్బు కావాలంటే మొదటగా గుర్తుకువచ్చేది పర్స్‌నల్‌ లోన్. అంతేకాక అధిక వడ్డీకి రుణం తీసుకోవడం కంటే మీకు ఖాతా ఉన్న బ్యాంక్ నుంచి పర్సనల్‌ లోన్ తీసుకోవడం ఉత్తమం. ఈ రుణం కూడా తక్షణమే లభిస్తుంది. పేపర్‌ వర్క్‌ కూడా తక్కువగా ఉంటుంది. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు సాధారణంగా 10.25% నుంచి 36% వరకు ఉంటుంది. అయితే మీరు రుణం పొందాలంటే మీ బ్యాంక్, రుణ రకం, క్రెడిట్ స్కోర్, ఇప్పటికే ఉన్న రుణం, ఆదాయం, రుణ మొత్తం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. రుణం తీసుకునే ముందు కొంత హోంవర్క్ చేయడం ఉత్తమం. అన్ని బ్యాంకులకు ఒకే వడ్డీ రేటు ఉండదు. బ్యాంకుల వడ్డీ రేటు తక్కువ లేదా ఎక్కువ కావచ్చు. దీని కోసం బ్యాంకుల జాబితాను చూడండి వాటి రేట్లను సరిపోల్చండి. తక్కువ వడ్డీని వసూలు చేస్తున్న బ్యాంక్ నుంచి రుణం తీసుకోండి. వ్యక్తిగత రుణాలను చౌకగా అందించే కొన్ని బ్యాంకుల గురించి తెలుసుకుందాం.

1. యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేటు యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేటు11%నుంచి మొదలవుతుంది. రుణ మొత్తంలో1.5% వరకు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రుణం చెల్లింపు కూడా ముందుగానే చేసే అవకాశం ఉంటుంది. రుణం తీసుకున్న 1 నుంచి 12 నెలల్లోపు డబ్బు తిరిగి చెల్లించకపోతే 5 శాతం పెనాల్టీ విధిస్తారు.

2. బజాజ్ ఫిన్‌సర్వ్ రేట్లు బజాజ్ ఫిన్‌సర్వ్ వ్యక్తిగత రుణ సదుపాయాన్ని అందిస్తుంది. ఇక్కడ వడ్డీ 11.49 శాతం నుంచి మొదలవుతుంది. రుణ మొత్తంలో 4% ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. లోన్ తీసుకున్న 1 నెల తర్వాత పాక్షిక ప్రీపేమెంట్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేటు 10.50 శాతం నుంచి ప్రారంభమవుతుంది. రుణ మొత్తంలో 2% ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి.

3. సెంట్రల్ బ్యాంక్ రేటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వ్యక్తిగత రుణం 9.55 శాతం నుంచి ప్రారంభమవుతుంది. రుణ మొత్తంలో 1% ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒప్పందం ప్రకారం మీరు రుణ మొత్తాన్ని ముందుగా చెల్లించవచ్చు. సెంట్రల్ బ్యాంక్ వ్యక్తిగత రుణం 8.45 శాతం వడ్డీతో మొదలవుతుంది. ఇందులో, రూ. 5000 వరకు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రుణ ఒప్పందం ప్రకారం ప్రీపేమెంట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. సిటీ బ్యాంక్ వ్యక్తిగత రుణం 9.99% నుంచి ప్రారంభమవుతుంది. రుణ మొత్తంలో 3% ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. రుణం తీసుకున్న 12 నెలల తర్వాత మాత్రమే ముందస్తు చెల్లింపు చేయవచ్చు.

4. ICICI బ్యాంక్ వడ్డీ రేటు ఫెడరల్ బ్యాంక్ 10.49 శాతం వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. HDFC బ్యాంక్ వ్యక్తిగత రుణం 12.50 శాతం నుంచి ప్రారంభమవుతుంది. రుణ మొత్తంలో 2.5 శాతం ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. మీరు 12 EMI లు చెల్లించిన తర్వాత లోన్ ప్రీపే చేయవచ్చు. మీరు మిగిలిన ప్రిన్సిపాల్‌లో 25% ప్రీపేమెంట్‌గా చెల్లించవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ వ్యక్తిగత రుణం 10.50 శాతం నుంచి ప్రారంభమవుతుంది. రుణ మొత్తంలో 2.5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాంక్ లోన్ ప్రీపేమెంట్ సౌకర్యాన్ని అందించదు.

లెమన్‌ జ్యూస్‌ కాఫీతో బరువు తగ్గుతారా..! ఇది కొవ్వు కరిగిస్తుందా.. తెలుసుకోండి..