Hyderabad: అలా.. సోమశిలకు. సమ్మర్‌లో అదిరిపోయే వీకెండ్‌ టూర్‌. ప్యాకేజీ పూర్తి వివరాలు..

అసలే వేసవి, ఎండలు దంచికొడుతున్నాయి. ఇంట్లో చిన్నారులకు హాలీడేస్‌.. అలా ఏదైనా టూర్‌ వేస్తే భలే ఉంటుంది కదూ! అయితే ఆఫీసుకు లీవ్‌ పెట్టకుండా కేవలం వారాంతసపు సెలవుల్లోనే చూసొచ్చే ఒక మంచి డెస్టినేషన్‌ ఉంది అదే సోమశిల. నల్లమల్ల పచ్చదనం, కృష్ణానది పరవళ్లు ఇలా ఎన్నో ప్రత్యేకతలకు..

Hyderabad: అలా.. సోమశిలకు. సమ్మర్‌లో అదిరిపోయే వీకెండ్‌ టూర్‌. ప్యాకేజీ పూర్తి వివరాలు..
Hyderabad To Somasila
Follow us
Narender Vaitla

|

Updated on: May 21, 2023 | 1:19 PM

అసలే వేసవి, ఎండలు దంచికొడుతున్నాయి. ఇంట్లో చిన్నారులకు హాలీడేస్‌.. అలా ఏదైనా టూర్‌ వేస్తే భలే ఉంటుంది కదూ! అయితే ఆఫీసుకు లీవ్‌ పెట్టకుండా కేవలం వారాంతసపు సెలవుల్లోనే చూసొచ్చే ఒక మంచి డెస్టినేషన్‌ ఉంది అదే సోమశిల. నల్లమల్ల పచ్చదనం, కృష్ణానది పరవళ్లు ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవైన సోమశిలను వీక్షించేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఒక రాత్రి, రెండు రోజులుగా ఉండే ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

హైదారాబాద్‌ – శ్రీశైలం – సోమశిల పేరుతో తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని అందిస్తోంది. ప్రతీ శనివారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. టూర్‌లో భాగంగా సోమశిల ఆంకాళమ్మకోట, బోట్ టూర్, శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి ద‌ర్శనంతో పాటు పలు పర్యాటక ప్రాంతాలు కవర్‌ అవుతాయి. 1 కాత్రి రెండు రోజులుగా ఉండే ఈ ప్రయాణం ఇలా సాగుతుంది..

* టూర్‌లో తొలి రోజు శనివారం ఉదయం ప్రారంభమవుతుంది. ఉదయం 9 గంటలకు బషీర్‌బాగ్‌ నుంచి బస్సు బయలుదేరుతుంది. మధ్యాహ్న భోజనానికి మార్గంలో ఆపుతారు. అనంతరం మార్గమధ్యంలో సాక్షి గణపతి ఆలయాన్ని సందర్శించుకొని సాయంత్రం శ్రీశైలం చేరుకుంటారు. బస కోసం నేరుగా హోటల్‌కు తీసుకెళ్తారు. రాత్రి శ్రీశైంలోనే బస ఉంటుంది. పర్యాటకులు సాయంత్రం లేదా తెల్లవారుజామున దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* రెండో రోజు ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత 9 గంటలకు శ్రీశైలం నుంచి లాంచీలో సోమశిలకు ప్రయాణం ఉంటుంది. మార్గమధ్యలో ఆంకాళమ్మకోట, కృష్ణా నది బ్యాక్ వాటర్స్, పక్కనే నది మధ్యలో వెలసిన ద్వీపంలో జాలర్ల నివాసాలు చూస్తు ప్రయాణం సాగుతుంది. అనంత‌రం సంగమేశ్వర ఆలయం సోమేశ్వరాలయం ద‌ర్శనం ఉంటుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమై రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. దీంతో టూర్‌ ముగుస్తుంది.

ధర విషయానికొస్తే..

టూర్‌ ప్యాకేజీ ధర విషయానికొస్తే నాన్‌ ఏసీ బస్సుకు గాను పెద్దలకు రూ. 4499, 5 నుంచి 12 ఏళ్ల చిన్నారులకు రూ. 3600 ఉంటుంది. ప్యాకేజీలో బ‌స్సు టికెట్లు, దర్శనం, నాన్‌ ఏసీ బోట్ ఛార్జీలు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..