Mahabaleshwar: మహబలేశ్వర్ ప్రత్యేకతలు తెలుసా.. అక్కడి అద్భుతాలు తెలిస్తే వెళ్ళకుండా ఉండలేరు..

మన దేశంలో ఎన్నో అందమైన అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రదేశాలు సీజన్స్‏లో ఎంతో అందంగా కనిపిస్తుంటాయి.

Mahabaleshwar: మహబలేశ్వర్ ప్రత్యేకతలు తెలుసా.. అక్కడి అద్భుతాలు తెలిస్తే వెళ్ళకుండా ఉండలేరు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 11, 2021 | 8:40 PM

మన దేశంలో ఎన్నో అందమైన అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రదేశాలు సీజన్స్‏లో ఎంతో అందంగా కనిపిస్తుంటాయి. వర్షాకాలంలో ఎంతో అద్భుతంగా ముస్తాబయ్యే ప్రాంతాలలో మహబలేశ్వర్ ఒకటి. మహారాష్ట్రలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది సముద్రమట్టానికి 1372 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన హిల్ స్టేషన్. ఇది పూణె నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్రిటిష్ కాలంలో మహాబలేశ్వర్ ముంబాయి ప్రెసిడెన్సీకి వేసవి రాజధానిగా ఉండేది. ఇక్కడున్న ప్రత్యేకతల గురించి తెలుసుకుందామా.

22

మెప్రో గార్డెన్.. మహాబలేశ్వర్-పంచగని రోడ్డులో మహాబలేశ్వర్ నుంచి 11 కి.మీ దూరంలో ఉన్న మెప్రో గార్డెన్ ఒక ప్రసిద్ధ ప్రదేశం. ఈ ప్రదేశం ముఖ్యంగా స్ట్రాబెర్రీ ఉత్పత్తికి ప్రసిద్ధి.. అయితే ఇక్కడ వివిధ రకాల చాక్లెట్లు, స్క్వాష్, ఫ్రూట్ క్రష్‌లు కూడా కనిపిస్తుంటాయి. ఇక్కడ పెద్ద తోటలోపల చాక్లెట్ ఫ్యాక్టరీ.. ఒక నర్సరీ కూడా ఉంది. ఇందులో ఎక్కువగా మొక్కలు, పువ్వుల చెట్లు ఉన్నాయి. ఈస్టర్ వారాంతంలో ప్రసిద్ధ స్ట్రాబెర్రీ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి ఎక్కువగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ ప్రదేశాన్ని సందర్శించాలి.

33 లింగమల జలపాతం పాయింట్.. మహాబలేశ్వర్ బస్టాండ్ నుంచి 6 కి.మీ దూరంలో లింగమల జలపాతం ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 1278 మీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న తర్వాత, దాదాపు 1.5 కిలోమీటర్ల మేర ట్రెక్ ఉంటుంది. అది మిమ్మల్ని అద్భుతమైన జలపాతం వైపు తీసుకువెళుతుంది. అందమైన జలపాతం దాని ఆకర్షణీయమైన అందం కారణంగా మహాబలేశ్వర్ చుట్టూ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రదేశాలలో ఒకటి. అంతేకాకుండా.. ఇక్కడున్న చిన్న జలపాతంలో ఈత స్వీమ్ చేయవచ్చు.

44

వెన్నా సరస్సు.. మహాబలేశ్వర్ బస్టాండ్ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో వెన్నా సరస్సు ఉంటుంది. ఇది మానవ నిర్మిత సరస్సు. దీనిని సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. దీని చుట్టుకొలత సుమారు 7 నుండి 8 కిలోమీటర్లు. చుట్టూ ఉన్న పచ్చదనం, ప్రకృతి సౌందర్యం కారణంగా ఈ ప్రదేశం ప్రతి ఒక్కరికీ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ బోటింగ్, గుర్రపు స్వారీ వంటివి ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలకు ఇక్కడ మెర్రీ-గో-రౌండ్, టాయ్ ట్రైన్ మొదలైనవి ఉంటాయి.

55

పంచగని.. మహాబలేశ్వర్ నుంచి 18 కి.మీ ఉండగా.. పుణే నుంచి 104 కి.మీ దూరంలో ఉన్న పంచగని మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఒక హిల్ స్టేషన్. ఇక్కడికి పర్యాటకుల తాకిడి ఎక్కువ. హిల్ స్టేషన్ సమీపంలోని నది ఆనకట్టలు ఉంటాయి. అలాగే వాటి చుట్టూ ఉన్న చిన్న గ్రామాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక్కడ పౌరాణిక ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది.

66

సూర్యాస్తమయం పాయింట్.. దీనినే ముంబై పాయింట్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం మహాబలేశ్వర్ బస్టాండ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహాబలేశ్వర్ ప్రదేశానికి పర్యాటకుల తాకిడి ఎక్కుడగా ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన ప్రాంతాలు అనేకం.

Also Read: Pushpa Movie: దాక్కో దాక్కో మేక సాంగ్ ప్రోమో రిలీజ్.. బన్నీ అస్సలు తగ్గడం లేదుగా.. ఫ్యాన్స్‏కు పూనకాలే..

Prakash Raj: హాస్పిటల్ బెడ్ పై నుంచే ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. మ్యాటరెంటంటే..