IRCTC: సమ్మర్ టూర్ ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి ప్రారంభం.. టికెట్ ధర.. ఇతర వివరాలు..!
IRCTC Tour Package: వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో సమ్మర్ టూర్‌కు ప్లాన్ వేస్తుంటారు. ఇక పర్యాటకులను ఉద్దేశించి ఐఆర్‌సీటీసీ (IRCTC) సరికొత్త టూర్‌ప్యాకేజీని అందుబాటులోకి..
IRCTC Tour Package: వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో సమ్మర్ టూర్‌కు ప్లాన్ వేస్తుంటారు. ఇక పర్యాటకులను ఉద్దేశించి ఐఆర్‌సీటీసీ (IRCTC) సరికొత్త టూర్‌ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ వేర్వేరు ప్రాంతాల నుంచి వరుసగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీలను (Tour Package) అందిస్తోంది. తాజాగా హైదరాబాద్ నుంచి తమిళనాడు టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. ‘ట్రెజర్స్ ఆఫ్ తమిళనాడు’ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. కొయంబత్తూర్, మదురై, కొడైకెనాల్, రామేశ్వరం, శ్రీరంగం, తంజావూర్, తిరుచ్చి ప్రాంతాలను కవర్ చేసేలా ప్యాకేజీ ఉంటుంది. ఇది 5 రాత్రులు, 6రోజుల టూర్ ప్యాకేజీ. మే 8వ తేదీన ఈ టూర్ ప్రారంభమై మే13న ముగుస్తుంది. IRCTC టూరిజం టూరిస్టుల్ని విమానాల్లో తీసుకెళ్లి తమిళనాడులోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఆరు రోజులు, ఐదు రాత్రులు ఉంటాయి.
టూర్ ప్యాకేజీ వివరాలివే
హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ ప్యాకేజీ.. ఉదయం 10.20 గంటలకు విమానంలో బయలుదేరి11.50 గంటలకు మదురై చేరుకుంటారు. మీనాక్షి టెంపుల్ సందర్శన తర్వాత రామేశ్వరంకు బయలుదేరుతారు పర్యాటనకులు. ఇక రాత్రికి రామేశ్వరంలో బస చేయాల్సి ఉంటుంది. ఇక 2వ రోజు ఉదయం సొంత ఖర్చులతో ధనుష్కోడికి బయలుదేరాలి. రామనథస్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత కలాం మెమొరియల్ సందర్శన ఉంటుంది. రాత్రికి రామేశ్వరంలో బస చేయాలి.
3వ రోజు ఉదయం తంజావూర్ బయలుదేరాలి. బృహదీశ్వర ఆలయం సందర్శన తర్వాత తిరుచ్చి బయలుదేరి, రాత్రికి తిరుచ్చిలో బస చేయాలి. 4వ రోజు ఉదయం శ్రీరంగం ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత కొడైకెనాల్ బయలుదేరాలి. రాత్రికి కొడైకెనాల్‌లోనే బస చేయాలి. ఐదో రోజు కొడైకెనాల్ టూర్ ఉంటుంది. రాత్రికి అక్కడే బస చేయాలి. ఇక 6వ రోజు ఉదయం పళని బయలుదేరి అక్కడ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత కొయంబత్తూర్‌కు పయనం అవుతారు. కొయంబత్తూర్ ఎయిర్‌పోర్టులో రాత్రి 8.05 గంటలకు విమానంలో ఎక్కితే రాత్రి 9.45 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.26,750 ఉండగా, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.28,450 నిర్ణయించింది ఐఆర్‌సీటీసీ. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.39,250 ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్ బస, బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, ఇతర సదుపాయాలుంటయి.ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్ లో తెలుసుకోవచ్చు.
Explore #South #India‘s myriad gems including the #RamanathaswamyTemple, #KalamMemorial, #BrihadeeswaraTemple, #SrirangamTemple & more with our 6D/5N ‘Treasures of Tamil Nadu’ air tour package starting at Rs. 26,750/-pp*. #Book now on https://t.co/5vdGOCSJb6.@AmritMahotsav
— IRCTC (@IRCTCofficial) March 26, 2022
ఇవి కూడా చదవండి: