Travel News: ప్రకృతి అందాలకు నెలవు ఈశాన్య భారతం.. సమ్మర్‌లో ఈ ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..!
Travel News: భారతదేశంలో చాలా సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మీరు ప్రకృతి ప్రేమికులు, ప్రయాణాలను ఇష్టపడేవారు
Travel News: భారతదేశంలో చాలా సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మీరు ప్రకృతి ప్రేమికులు, ప్రయాణాలను ఇష్టపడేవారు అయితే మీకు ఈశాన్య భారతం చాలా బాగా నచ్చుతంది. ఇక్కడ మీరు సహజ సౌందర్యాన్ని తిలకించవచ్చు. ఈ ప్రశాంత వాతావరణంలో గడపడం వల్ల మనసు చాలా రిలాక్స్ గా ఉంటుంది. అలాంటి కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. అందులో అత్యంత ముఖ్యమైనది గౌహతి నగరం అని చెప్పవచ్చు. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న గౌహతి నగరం చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రదేశాలని చూస్తే మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటారు. ఇక్కడ పర్వత శ్రేణుల అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఈ నగరం పురాతన హిందూ దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కామాఖ్య దేవాలయం, ఉమానంద దేవాలయం, అస్సాం స్టేట్ మ్యూజియం, పోబిటోరా వన్యప్రాణుల అభయారణ్యం, ఫ్యాన్సీ బజార్ మొదలైన అనేక ప్రదేశాలు చూడవచ్చు.
కోహిమా
కోహిమా భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌కు రాజధాని. ఈ నగరం ఈశాన్య భారతదేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఎత్తైన శిఖరాలు, మేఘాలు, వీచే గాలి పర్యాటకులను చాలా ఆకర్షిస్తుంది. మీరు ఇక్కడికి వస్తే జుకౌ వ్యాలీ, జులేకి జలపాతాన్ని తప్పకుండా సందర్శించండి. ఈ ప్రదేశంలో పర్వతాల చుట్టూ కోహిమా పువ్వు కనిపిస్తుంది. అందుకే ఈ నగరానికి కోహిమా అని పేరు వచ్చింది. ఇక్కడ జుఫు పీక్, స్టేట్ మ్యూజియం, కోహిమా జూ, కోహిమా కాథలిక్ చర్చి మొదలైనవి పర్యాటకులని ఆకర్షిస్తాయి.
అగర్తల
అగర్తల త్రిపుర రాజధాని. ఈ నగరం సాంస్కృతికంగా చాలా గొప్పది. ఈ నగరంలో అగర్ చెట్లు ఎక్కువగా ఉండటంతో అగర్తాలా అని పేరు పెట్టారు. హౌరా నది ఒడ్డున ఉన్న ఈ నగరం సందర్శించడానికి చాలా బాగుంటుంది. ఇక్కడి సాహస ప్రదేశాలు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఉజ్జయితన్ ప్యాలెస్, నీర్‌మహల్, త్రిపుర ప్రభుత్వ మ్యూజియం వంటి అనేక అందమైన స్మారక చిహ్నాలు చూడవచ్చు. ఉమా మహేశ్వరి, లక్ష్మీనారాయణ, కాళీ, జగన్నాథ్ జీ ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందినవి.
ఇంఫాల్
ఇంఫాల్ నగరం మణిపూర్ రాజధాని. సముద్ర తీరానికి 790 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ప్రకృతి అద్భుతమైన దృశ్యాలను సులభంగా ఆస్వాదించవచ్చు. నగరం చుట్టూ పచ్చని లోయలు, ఉత్కంఠభరితమైన కొండలు ఉంటాయి. పోలో గ్రౌండ్ ఇంఫాల్‌లోని పురాతన పర్యాటక కేంద్రం. ఇది కాకుండా కాంగ్లా ఫోర్ట్, మణిపూర్ జూలాజికల్ గార్డెన్, కీబూజ్ నేషనల్ పార్క్, లోక్‌తక్ సరస్సు, సిరోహి నేషనల్ పార్క్ మొదలైన అనేక ప్రదేశాలు చూడవలసిన ప్రదేశాలలో ఉన్నాయి.