AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళలకి అలర్ట్‌.. హెల్త్‌ ఇన్సూరెన్స్ సమయంలో కచ్చితంగా ఈ ఆప్షన్ ఎంచుకోండి..!

Women Health Insurance: కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు హెల్త్‌ ఇన్సూరెన్స్ అవసరాన్ని గుర్తించారు. అందుకే ప్రస్తుతం ప్రతి ఒక్కరు హెల్త్‌ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు.

మహిళలకి అలర్ట్‌.. హెల్త్‌ ఇన్సూరెన్స్ సమయంలో కచ్చితంగా ఈ ఆప్షన్ ఎంచుకోండి..!
Women Health Insurance
uppula Raju
| Edited By: TV9 Telugu|

Updated on: May 07, 2024 | 12:20 PM

Share

Women Health Insurance: కరోనా మహమ్మారి తర్వాత ప్రజలు హెల్త్‌ ఇన్సూరెన్స్ అవసరాన్ని గుర్తించారు. అందుకే ప్రస్తుతం ప్రతి ఒక్కరు హెల్త్‌ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయితే మహిళలు ఈ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. కచ్చితంగా మెటర్నిటీ బెనిఫిట్ ఆప్షన్ ఎంచుకోవాలి. దీనివల్ల వారు చాలా లబ్ధి పొందుతారు. ఇండియాలో ప్రతి సంవత్సరం కోట్లాది మంది పిల్లలు పుడుతున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులకు మానసిక బలంతోపాటు ఆర్థిక బలం కూడా అవసరం. ఈ రోజుల్లో ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. అందుకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేటప్పుడు మహిళలు సరైన పాలసీని ఎంచుకోవాలి. మీరు భవిష్యత్తులో పిల్లల కోసం కూడా ప్లాన్ చేస్తుంటే మెటర్నిటీ బెనిఫిట్ ఆప్షన్ ఎంచుకుంటే మంచిది.

మెటర్నిటీ బెనిఫిట్ అంటే ఏమిటి?

మీరు హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో ప్రసూతి ఖర్చులను చేర్చినట్లయితే మీ పిల్లల జనన ఖర్చుల భారం నుంచి తప్పించుకుంటారు. మహిళలు భవిష్యత్తులో బిడ్డను కనాలని ఆలోచిస్తున్నట్లయితే హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో ప్రసూతి ఖర్చులను చేర్చడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఒక బిడ్డ పుట్టినప్పుడు ప్రసూతి ఖర్చు, ఆపరేషన్, ఔషధం కోసం మహిళ చేసే మొత్తం డబ్బు ఈ హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో చేర్చుతారు. దీంతో పాటు పిల్లలు పుట్టిన తరువాత పిల్లల ఆరోగ్య సంరక్షణ ఖర్చు కూడా కవర్ అవుతుంది. ఇందులో ఆసుపత్రి ఖర్చులు, మందులు, పరీక్షలు మొదలైనవి ఉంటాయి.

ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి..

1. సిజేరియన్ డెలివరీ ఖర్చు.

2. మెడికల్ ఖర్చు.

3. హాస్పిటల్ బిల్లు.

4. పిల్లల చికిత్స ఖర్చు.

5. తల్లి చికిత్స ఖర్చుతో సహా మొత్తం.

IPL 2022: ఆర్‌సీబీ బోణీ కొట్టేనా.? కోల్‌కతా జోరుకు కళ్లెం పడేనా.! ఢీ అంటే ఢీ..

Jamun Benefits: నేరేడు పండుతో అద్భుతమైన ప్రయోజనాలు.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు..