Jamun Benefits: నేరేడు పండుతో అద్భుతమైన ప్రయోజనాలు.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు..

వేసవిలో లభించే పండ్లలో నేరుడు పండు (Jamun) ఒకటి. వీటిని జామూన్ లేదా బ్లాక్ ఫం అని అంటారు. ఇది తీపి, వగరు రుచులను కలిగి ఉంటుంది.

Jamun Benefits: నేరేడు పండుతో అద్భుతమైన ప్రయోజనాలు.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు..
Jamun
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 30, 2022 | 8:55 AM

వేసవిలో లభించే పండ్లలో నేరుడు పండు (Jamun) ఒకటి. వీటిని జామూన్ లేదా బ్లాక్ ఫం అని అంటారు. ఇది తీపి, వగరు రుచులను కలిగి ఉంటుంది. అయితే ఈ నేరేడు పండుతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా.. రక్తాన్ని శుద్ధీచేయం.. హిమోగ్లోబిన్‏ను మెరుగుపరచడం, జీర్ణ సమస్యలను తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలున్నాయి. అంతేకాకుండా.. నేరేడు పండు గింజలను ఆయుర్వేదంలో పలు చికిత్సలకు ఉపయోగిస్తుంది. ఇది జంబోలిన్ అనే సమ్మెళనాన్ని కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెరను తగ్గించడమే కాకుండా.. ఇన్సులిన్ నిరోధకతకు వ్యతిరేకమైన సెన్సిటివిటీని పెంచుతుంది.

నేరేడు పండులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి, బి6 ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని మెరుగుపరచడంలో సహయపడతాయి. అంతేకాకుండా.. ఇందులో ఉండే ఐరన్ రక్తాన్ని శుద్దిచేయడమే కాకుండా హిమోగ్లోబిన్ ను అన్ని శరీర భాగాలకు ఆక్సిజన్ అందేలా సహయపడుతుందని ఈట్ ఫిట్ 247 వ్యవస్థాపకురాలు సెలబ్రెటీ డైటీషియన్ శ్వేతా షా తెలిపారు. అలాగే మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతుంటే నేరేడుపండులోని ఆస్ట్రింజెంట్ గుణం చర్మంపై ఏర్పడే మొటిమల సమస్యను తగ్గించడంలో సహయపడుతుంది. నేరేడుపండులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం, రక్తంలోని టాక్సిన్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే వృద్ధాప సమస్యలను తగ్గిస్తుంది.

నేరేడు పండు ప్రయోజనాలు..

* రక్తంలో హిమోగ్లోబిన్, ఐరన్ కంటెంట్‌ను మెరుగుపరుస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే ఏజెంట్‌గా పనిచేస్తుంది. చర్మం, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. * ఇందులో పొటాషియం పుష్కలంగా ఉన్నందున ధమనుల సంరక్షణ ద్వారా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వ్యాధులను బే వద్ద ఉంచడంలో నేరుడు పండు సహయపడుతుంది. * నేరేడు పండు తినడం చిగుళ్ళు, దంతాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వాటిలోని సహజ ఆమ్లాలు బ్యాక్టీరియాతో పోరాడటానికి, నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. * మాలిక్ యాసిడ్, టానిన్లు, గ్యాలిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్, బోటులినమ్ యాసిడ్ కలిగి ఉండే నేరేడుపండులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్టివ్ , యాంటీ మలేరియా లక్షణాలు సాధారణ ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తాయి. * కడుపు నొప్పి, కీళ్లనొప్పులకు నేరేడు పండు మంచిది. దీనిని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. విరేచనాలు, అపానవాయువు వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో కూడా ఈ పండు సహాయపడుతుంది. * తరచుగా మూత్రవిసర్జన, దాహంతో సహా మధుమేహం టైప్ 2 యొక్క లక్షణాలను జామున్ నయం చేస్తుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణంగా ఉంచుతుంది. ఇది జీవనశైలి ఆధారిత వ్యాధి అయిన టైప్ 2 మధుమేహం రాకుండా నిరోధిస్తుంది.

గమనిక:- గమనిక:- ఈ కథనం కేవలం వైద్యుల సూచనలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని అమలు చేయడానికి ముందుగా వైద్యులను సంప్రదించాలి.