Ice Cream: వేసవిలో ఐస్క్రీంను ఎక్కువగా తినేస్తున్నారా ? అయితే మీరు ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే.
ఐస్ క్రీమ్ (Ice Cream).. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఇష్టపడని వారుండరు. ఐస్ క్రీమ్ తినడానికి వయసు ఏమాత్రం అడ్డురాదు.
ఐస్ క్రీమ్ (Ice Cream).. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఇష్టపడని వారుండరు. ఐస్ క్రీమ్ తినడానికి వయసు ఏమాత్రం అడ్డురాదు. ఇక వేసవిలో దీని డిమాండ్ మరింత పెరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువగా తినేస్తుంటారు. రోజులో 4కు కంటే ఐస్ క్రీమ్ తినేస్తారు. అయితే ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఐస్ క్రీంలో పాలు, చాక్లెట్, అనేక రకాల డ్రైఫ్రూట్స్, చెర్రీస్ వంటివి వాడతారు. ఇవన్ని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఐస్ క్రీం ఎక్కువగా తినడం వలన ఎలాంటి హాని జరుగుతుందో తెలుసుకుందామా.
ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడంవలన కలిగే నష్టాలు..
నివేదికల ప్రకారం.. ఐస్ క్రీంలో చక్కెర, కేలరీలు, కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం కాదు… కానీ ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు రెండు మూడు ఐస్‌క్రీమ్‌లు తింటే 1000కి పైగా క్యాలరీలు శరీరంలోకి చేరతాయి. దీంతో బరువు పెరుగుతారు. రోజులో శరీర అవసరాల కంటే ఎక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల ఊబకాయం బారిన పడవచ్చు.
ఐస్ క్రీంలో కార్బ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో అధిక శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ల వినియోగం కారణంగా బొడ్డులో కొవ్వు పేరుకుపోతుంది. అయితే పిండి పదార్థాలు శక్తిని అందిస్తాయి. కాబట్టి ఐస్ క్రీంను మితంగా తీసుకోవాలి.
ఐస్‌క్రీమ్‌లో పరిమిత కొవ్వు ఉంటుంది . ఐస్ క్రీం తినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఎవరికైనా అధిక రక్తపోటు, అధిక బరువు ఉంటే రోజూ ఐస్‌క్రీం ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక కప్పు వెనిల్లా ఐస్‌క్రీమ్‌లో 10 గ్రాముల వరకు ధమని- అడ్డుపడే సంతృప్త కొవ్వు, 28 గ్రాముల చక్కెర ఉంటుంది. సంతృప్త కొవ్వు, చక్కెరతో కూడిన ఆహారం అభిజ్ఞా నైపుణ్యాలను, జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. కేవలం ఒక కప్పు ఐస్ క్రీం తినడం ద్వారా కూడా ఇది జరుగుతుంది.
ఐస్‌క్రీమ్‌లో చాలా షుగర్ ఉంటుంది. వీటిని తీసుకున్న తర్వాత బ్లడ్ షుగర్ స్థాయి పెరుగుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు పరిమితంగా ఐస్ క్రీం తీసుకోవాలి. ఐస్‌క్రీమ్‌లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా ఇది ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుంది. త్వరగా జీర్ణం కాకపోవడం వల్ల రాత్రిపూట ఐస్ క్రీం తిన్న తర్వాత నిద్రపోవడం వల్ల మంచి నిద్ర రాదు.
ఐస్ క్రీమ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
* వేసవి కాలంలో ఐస్ క్రీం తినడం వల్ల రిఫ్రెష్, కూల్ ఫీలింగ్ వస్తుంది. * చాక్లెట్ ఐస్ క్రీం తినడం వల్ల చాక్లెట్‌లో ఉండే పోషకాల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. * ఐస్‌క్రీమ్‌లో పాలు, డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ కూడా ఉంటాయి, ఇవి శరీరానికి అనేక పోషకాలను అందిస్తాయి. * పాల వల్ల కాల్షియం, విటమిన్ ఎ, డి, ప్రొటీన్ల లోపం ఉండదు. ఎముకలు దృఢంగా ఉంటాయి. * ఐస్‌క్రీం తింటే మనసుకు ఆనందం, ఒత్తిడి దూరమవుతుంది. మూడ్ మంచిగా మారుతుంది. * అల్సర్ల వల్ల ఇబ్బంది పడుతుంటే, ఐస్ క్రీం తినడం వల్ల మంట, నొప్పి తగ్గుతుంది.
గమనిక:- గమనిక:- ఈ కథనం కేవలం వైద్యుల సూచనలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని అమలు చేయడానికి ముందుగా వైద్యులను సంప్రదించాలి.
Also Read: Mishan Impossible : తాప్సీ పన్ను `మిషన్ ఇంపాజిబుల్` కోసం రంగంలోకి జాతిరత్నం
NTR: యంగ్ టైగర్ అభిమానులకు పండగలాంటి వార్త.. కొరటాల శివ సినిమా మొదలయ్యేది అప్పుడే..
Sudheer Babu : కొత్త సినిమా షురూ చేసిన యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు న్యూ పోస్టర్
Kangana Ranaut : ఆ ప్లేస్‌లో నేనుంటే గట్టిగా తన్నేదాన్ని.. ‘ఆస్కార్’ ఘటన పై కంగనా రియాక్షన్