Araku Tour: అందాల ‘అరకు’ టూర్ ప్లాన్ చేశారా..? IRCTC నుంచి సూపర్ ప్యాకేజ్.. వెంటనే బుక్ చేస్కోండి
అరకు టూర్ వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్‌ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ నుంచి అరకు వెళ్లాలనుకునేవారికి ఈ ప్యాకేజ్ బాగా ఉపయోగపడుతుంది. మొత్తం నాలుగు రోజులు పాటు ఈ టూర్ ఉంటుంది. ధర ఎంత.. ? ఏయే ప్రదేశాలు చూపిస్తారు? అనే వివరాలు..

IRCTC Tourisam: ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి తెలుగు రాష్ట్రాల్లో ఊటిగా పేరు పొందిన అరకుకు వెళ్లి అక్కడి అందాలను ఆస్వాదించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఒకసారైనా అరకు ట్రిప్‌కు వెళ్లాలనే కోరుకునేవారు కూడా ఉంటారు. సెలవులు దొరికినప్పుడు అరకు వెళ్లి తమ స్నేహితులు, ఫ్యామిలీతో వెళ్లాలని ప్లాన్ చేసుకునేవారు చాలామందే ఉంటారు. మంచుతో కప్పి ఉన్న జలపాతాలు, అక్కడి కొండలు, పచ్చదనం చూస్తే ఎవరైనా పరవశించిపోవాల్సిందే. ఇక శీతాకాలంలో అయితే మరింత అద్బతుంగా ఉంటుంది. అరకు ఎలా వెళ్లాలి..? అక్కడ ఏయే ప్రదేశాలు సందర్శించాలి..? ఎక్కడ బస చేయాలి? అనే విషయాలు చాలామందికి తెలియదు. అలాంటివారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మీరు జర్నీ, వసతి గురించి ఎలాంటి ఆందోళన లేకుండా అరకు ప్రకృతి సోయగాలు చూసి రావొచ్చు.
టూర్ స్టార్ట్ ఎప్పుడంటే..?
వచ్చే ఏడాది జనవరి 25 నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. 25వ తేదీన హైదరాబాద్ నుంచి విశాఖకు విమాన ప్రయాణం ఉంటుంది. ఇక టూర్ పూర్తయ్యాక తిరిగి 28వ తేదీన విశాఖ నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో వస్తారు.
సందర్శనలు
సబ్‌మెరీన్ మ్యూజియం, రామకృష్ణ బీచ్, అరకు, బొర్రా గుహలు, టైడా జున్లే బెల్స్, పద్మాపురం గార్డెన్స్, కాఫీ మ్యూజియం, కైలాసగిరి కొండలు, ఎర్ర ఇసుక కొండలు, తోట్లకొండ శిథిలాలు, రుషికొండ బీచ్, రాస్ హిల్‌ను సందర్శించవచ్చు. తరువాత సింహాచలం ఆలయ దర్శనం కూడా ఉంటుంది.
సౌకర్యాలు
ఈ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లతో పాటు హోటల్స్‌లో వసతి, భోజనం, ఏసీ బస్సు సౌకర్యం, ప్రమాద బీమా, ఎస్కార్ట్ సేవలు కవర్ అవుతాయి
ఇవి మీరే చూసుకోవాలి
ఫ్లైట్‌లో భోజనం, సందర్శనా స్థలాలు లేదా దేవాలయాలలో ప్రవేశ టిక్కెట్లు లేదా దర్శన టిక్కెట్లు, లాండ్రీ ఖర్చులు, వైన్, మినరల్ వాటర్, పానీయాలు వంటి వ్యక్తిగత ఖర్చులు మీరే చూసుకోవాలి.
ప్యాకేజీ ధర ఎలా ఉందంటే..?
ఒక వ్యక్తికి రూ.26,500, డబుల్ షేరింగ్ అయతే రూ.22,500, ట్రిపుల్ షేరింగ్ రూ.21,000గా ఉంది. ఇక చైల్డ్ విత్ బెడ్(5-11 Yrs)కు రూ.18,650, చైల్డ్ వితౌట్ బెడ్(5-11 Yrs)కు రూ.18650, చైల్డ్ వితౌట్ బెడ్ (2-4Yrs)కు రూ.14,900గా ఉంది.
ఎలా బుక్ చేసుకోవాలి..?
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA55 వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ నౌ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.. ఆ తర్వాత మీ ప్యాకేజ్ వివరాలు నమోదు చేయండి. ఆ తర్వాత ఐఆర్‌సీటీసీ అకౌంట్ డీటైల్స్‌తో లాగిన్ అవ్వండి.. ఆ తర్వాత మీ కుటుంబసభ్యుల వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ చేస్తే బుకింగ్ కంప్లీట్ అవుతుంది.
