AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foreign: మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా..! అయితే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి..

Foreign: ప్రస్తుతం విదేశాలకు వెళ్లడం అందరికి సర్వసాధారణమైపోయింది. అందమైన ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు నిత్యం విదేశాలలో పర్యటిస్తారు. కానీ

Foreign: మీరు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా..! అయితే కచ్చితంగా ఈ 5 విషయాలు తెలుసుకోండి..
Foreign Travel
uppula Raju
|

Updated on: Oct 31, 2021 | 9:19 PM

Share

Foreign: ప్రస్తుతం విదేశాలకు వెళ్లడం అందరికి సర్వసాధారణమైపోయింది. అందమైన ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు నిత్యం విదేశాలలో పర్యటిస్తారు. కానీ మీరు ఏదైనా దేశానికి వెళ్లే ముందు కొన్ని విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి దేశానికి నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి. అక్కడికి వెళ్లిన తర్వాత మీరు ఇబ్బందులు ఎదుర్కోకూడదనుకుంటే అక్కడి నియమాలు, చట్టాలు, సంస్కృతి, భాష, ఆహారం, ప్రయాణం, వీసా మొదలైన వాటి గురించి తెలుసుకోవాలి.

1. పాస్‌పోర్ట్‌, వీసా మీరు విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ముందుగా మీ పాస్‌పోర్ట్ గడువు తేదీని చెక్‌ చేసుకోండి. ఎందుకంటే సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటులో ఉండాలి. దీంతోపాటు మీకు టూరిస్ట్ వీసా అవసరమా లేదా అని కూడా తెలుసుకోవడం మంచిది.

2. వైద్య పరీక్షలు, మందులు ఏదైనా విదేశీ పర్యటనకు వెళ్లే ముందు మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని ఫుల్‌ బాడీ చెకప్‌ చేసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు విదేశాల్లో శారీరక సమస్యలు తలెత్తవచ్చు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ మీతో ఉంటే మంచిది. మీరు తీసుకునే ఔషధం వేరే దేశంలో మీకు అందుబాటులో ఉంటుందో లేదో తెలియదు కాదా..

3. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి మీరు విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ఆ దేశంలోని స్థానిక ఆహారం ఏంటో తెలుసుకోండి. ఇది కాకుండా మీరు శాఖాహారం లేదా భారతీయ ఆహారాన్ని తినాలనుకుంటే ఎక్కడ తినవచ్చో తెలుసుకుంటే మంచిది. సాధారణంగా విదేశాల్లో శాఖాహారులు ఆహార సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

4. సందర్శించాల్సిన స్థలాలను ప్రివ్యూ చేయండి విహారయాత్రకు వెళ్లే ముందు మీరు ఆ దేశంలో ఏ ప్రదేశాలను సందర్శించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. అక్కడికి ఎలా అయితే తొందరగా వెళ్లొచ్చో తెలుసుకోండి. టూర్‌కి వెళ్లేముందు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

5. ఎంట్రీ, ఎగ్జిట్ ఫీజు గురించి తెలుసుకోండి వీసా లేకుండా కొన్ని దేశాలు సందర్శించవచ్చు. కానీ అక్కడ ఎంట్రీ లేదా ఎగ్జిట్ రుసుము చెల్లించాలి. మీరు అలాంటి దేశాన్ని ఎంచుకుంటే ఆ దేశంలో టూరిస్ట్ వీసా అవసరం ఉండదు. అయితే ఆ రుసుము ఎంతో తెలుసుకుంటే మంచిది.

Telangana: రామగుండం, జగిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు

PM Modi: టెన్షన్‌ పెంచుతున్న స్లో వాక్సినేషన్‌.. ప్రధాని మోడీ అధ్యక్షతన 11 రాష్ట్రాల సీఎంలతో సమావేశం.. ఎప్పుడంటే..?

Indian Railway: రైల్వేలో ఉద్యోగం సంపాదించడం మీ లక్ష్యమా..! అయితే కచ్చితంగా ఈ న్యూస్‌ తెలుసుకోండి..