Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka Tourism: కర్ణాటక అందాలు చూడతరమా.. ఒక్కసారి ఈ ప్రాంతాలు చూస్తే చాలు మైమరిచిపోతారు.!

భారతదేశంలోని టాప్ 4 పర్యాటక ప్రదేశాలలో కర్ణాటక కూడా ఒకటి. ప్రతీ సంవత్సరం అనేక మంది పర్యాటకులు ఈ రాష్ట్రంలో అందమైన ప్రదేశాలను..

Karnataka Tourism: కర్ణాటక అందాలు చూడతరమా.. ఒక్కసారి ఈ ప్రాంతాలు చూస్తే చాలు మైమరిచిపోతారు.!
Karnataka
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 01, 2021 | 8:31 PM

భారతదేశంలోని టాప్ 4 పర్యాటక ప్రదేశాలలో కర్ణాటక కూడా ఒకటి. ప్రతీ సంవత్సరం అనేక మంది పర్యాటకులు ఈ రాష్ట్రంలో అందమైన ప్రదేశాలను చూసేందుకు తరలి వస్తారు. సంస్కృతికి, సందర్శనకు కర్ణాటక రాష్ట్రం ఎంతో ప్రత్యేకం. బీచ్‌లు, పసందైన ఆహార రుచులు, ఎన్నో పర్యాటక ప్రదేశాలకు కర్ణాటక పెట్టింది పేరు.

కర్ణాటకలో 5 జాతీయ ఉద్యానవనాలు, 25 కన్నా ఎక్కువ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయి. వీటిల్లో బందీపూర్, నాగర్‌హోల్ జాతీయ ఉద్యానవనాలు అత్యంత ప్రసిద్ధి చెందినవి. కాఫీ తోటలకు ప్రసిద్ది చెందినది కూర్గ్. ఇలా ఒకటేమిటి కర్ణాటకలోని ఎన్నో ప్రసిద్దిచెందిన ప్రాంతాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

కూర్గ్..

ఆకర్షణీయమైన పర్వత శ్రేణులకు కూర్గ్ పెట్టింది పేరు. ఈ పర్యాటక ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలా అనిపిస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలను మర్చిపోలేం. ఇదొక హిల్ స్టేషన్ కాగా.. చుట్టూ పచ్చని కొండలు, నదులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

గోకర్ణ..

బీచ్‌లకు గోకర్ణ పెట్టింది పేరు. ఇక్కడ ఉన్న బీచ్‌లు చాలా ప్రత్యేకమైనవి, విభిన్నమైనవి. గోకర్ణలో శివుడి ఆలయం ఫేమస్. మీరు హాలిడేని ప్రశాంతంగా గడపాలనుకుంటే, ఈ ప్రదేశం ఉత్తమం.

హంపి..

యునెస్కో గుర్తింపు పొందిన హంపి చుట్టూ ఉండే కొండలు, లోయలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. చరిత్రకు సంబంధించిన శిధిలాలను ఇక్కడ మీరు చూడవచ్చు.

నంది కొండలు..

కర్ణాటక రాజధాని బెంగుళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం పర్యాటకుల ఫస్ట్ ఛాయస్ అని చెప్పొచ్చు. ఇక్కడ సూర్యోదయానికి సంబంధించిన ఆకర్షణీయమైన దృశ్యాన్ని చూడొచ్చు. అందుకే చాలామంది వారాంతంలో బెంగళూరు నుంచి ఇక్కడి వస్తారు.

మైసూర్ టూరిజం..

కర్ణాటకలోని టూరిస్ట్ ప్రాంతాల్లో మైసూర్ కూడా ఒకటి. ‘ప్యాలెస్ నగరం’గా ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతంలో ఎన్నో విభిన్న విషయాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో మూడవ అత్యధిక జనాభా కలిగిన నగరం మైసూర్. ప్రతి సంవత్సరం వందలాది మంది ఇక్కడికి వస్తుంటారు. మైసూర్ ప్యాలెస్ ఈ నగరానికి గర్వకారణం. అలాగే బొటానికల్ గార్డెన్స్, జూ పార్క్ కూడా ఇక్కడ ఫేమస్. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్లలో ఊటీ కూడా చుట్టి వచ్చేయొచ్చు.

జాతీయ ఉద్యానవనం..

బందీపూర్ నేషనల్ పార్క్ ప్రాజెక్ట్ టైగర్ కింద 1974లో స్థాపించారు. పర్యాటకులను ఈ ప్రదేశం బాగా ఆకట్టుకుంది. అయితే ఇక్కడ రాత్రి 9 నుండి ఉదయం 6 గంటల వరకు ప్రజలకు నో ఎంట్రీ.

తప్పిపోయిన బాలిక.. వెంటనే డ్రోన్‌తో యాక్షన్‌లోకి పోలీసులు
తప్పిపోయిన బాలిక.. వెంటనే డ్రోన్‌తో యాక్షన్‌లోకి పోలీసులు
రామ జన్మభూమి వాచ్‌ను ధరించిన సల్మాన్.. కాస్ట్ ధరెంతో తెలుసా?
రామ జన్మభూమి వాచ్‌ను ధరించిన సల్మాన్.. కాస్ట్ ధరెంతో తెలుసా?
ఈపీఎఫ్ఓ కీలక నియమాల మార్పు.. ఏటీఎం ద్వారా విత్‌డ్రా ఎప్పుడంటే..?
ఈపీఎఫ్ఓ కీలక నియమాల మార్పు.. ఏటీఎం ద్వారా విత్‌డ్రా ఎప్పుడంటే..?
సరైన ప్రేమికులు ఈ రాశుల వారే! వారి కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధం
సరైన ప్రేమికులు ఈ రాశుల వారే! వారి కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధం
అయ్యో పాపం.. తలారీ ప్రాణం తీసిన రీల్స్‌ పిచ్చి..! షాకింగ్‌ వీడియో
అయ్యో పాపం.. తలారీ ప్రాణం తీసిన రీల్స్‌ పిచ్చి..! షాకింగ్‌ వీడియో
ఆదాయపు పన్ను శాఖ నుండి ఈ మెసేజ్‌ వచ్చిందా? వెంటనే ఈ పని చేయండి
ఆదాయపు పన్ను శాఖ నుండి ఈ మెసేజ్‌ వచ్చిందా? వెంటనే ఈ పని చేయండి
భారత్-అమెరికా మధ్య బలమైన బంధంః గోయల్
భారత్-అమెరికా మధ్య బలమైన బంధంః గోయల్
నామినీని చేర్చకుండా ఖాతాదారుడు మరణిస్తే ఏం చేయాలి? ఆ డబ్బు ఎవరికి
నామినీని చేర్చకుండా ఖాతాదారుడు మరణిస్తే ఏం చేయాలి? ఆ డబ్బు ఎవరికి
ఆ గ్రామాల ప్రజలకు సడెన్‌గా బట్టతల ఎందుకొచ్చింది? వీడియో
ఆ గ్రామాల ప్రజలకు సడెన్‌గా బట్టతల ఎందుకొచ్చింది? వీడియో
మామిడిపండుతో రవితేజ బ్యూటీ.. క్యూట్ ఫొటోస్ వైరల్
మామిడిపండుతో రవితేజ బ్యూటీ.. క్యూట్ ఫొటోస్ వైరల్