Viral Video: హైనాను నోట కరిచిన సింహం.. వీడియోలో చివరికి ఏమైందో చూస్తే నోరెళ్లబెడతారు.!

అడవిలో నియమాలు భిన్నంగా ఉంటాయి. అక్కడ కేవలం శక్తివంతులు మాత్రమే జీవించగలరు. సింహం, పులి, చిరుత, హైనా లాంటి...

Viral Video: హైనాను నోట కరిచిన సింహం.. వీడియోలో చివరికి ఏమైందో చూస్తే నోరెళ్లబెడతారు.!
Lion And Hyena
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 01, 2021 | 8:29 PM

అడవిలో నియమాలు భిన్నంగా ఉంటాయి. అక్కడ కేవలం శక్తివంతులు మాత్రమే జీవించగలరు. సింహం, పులి, చిరుత, హైనా లాంటి క్రూర జంతువులు ఎప్పుడూ ఆహారం కోసం వేటాడుతూనే ఉంటాయి. ఇక వాటికి దొరక్కుండా తప్పించుకునేందుకు మిగతా జంతువులు తమ తెలివిని, చురుకుదనాన్ని ఎలప్పుడూ ప్రదర్శిస్తూ ఉండాలి.

ఇదిలా ఉంటే హైనాలు సర్వభక్షకాలు.. ఏ జంతువునైనా గుంపుగా చుట్టుముడతాయి.. వాటిని పీక్కు తింటాయి. అయితే సింహం.. సింహమే.. అడవికి రాజైన సింహంతో ఏ జంతువు కూడా పోటీ పడదు. ఒక్కసారిగా మృగరాజుకు చిక్కితే ప్రాణాలు పోయినట్లే. తాజాగా హైనా, సింహం మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ పోరులో ఎవరు గెలిచారు.? ఫలితం ఏంటి.? అనేది చూద్దాం..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ సింహం హైనాను తన నోట కరిచినట్లు మీరు వీడియోలో చూడవచ్చు. అయితే హైనా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. సింహం నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అయితే మృగరాజు మాత్రం పూర్తిగా తన ఆధిపత్యాన్ని చెలాయించింది. సుమారు రెండు నిమిషాల పాటు సాగిన ఈ పోరులో హైనా ఎలాగోలా సింహం నుంచి తప్పించుకుంది. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఈ వీడియోను ‘ఆఫ్రికన్ బుష్ కింగ్‌డమ్’ అనే ఫేస్‌బుక్‌ పేజ్ సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి లైకులు, షేర్లతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటిదాకా ఈ వీడియో 1లక్ష 68 వేల వ్యూస్ దక్కించుకోగా.. 1.5 వేల మంది లైక్ కొట్టారు. ‘ఇదే అడవి నియమం అంటే.. ఇక్కడ ఎవరు గెలుస్తారో ఎవ్వరూ చెప్పలేరు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘హైనాకు అద్భుతమైన శక్తి ఉంది.. అందుకే ఎప్పుడూ సింహంతో పోరడగలడు’ అని మరొకరు కామెంట్ చేశారు.