Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: టెన్షన్‌ పెంచుతున్న స్లో వాక్సినేషన్‌.. ప్రధాని మోడీ అధ్యక్షతన 11 రాష్ట్రాల సీఎంలతో సమావేశం.. ఎప్పుడంటే..?

PM Modi: స్లో వ్యాక్సినేషన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన11 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రులు

PM Modi: టెన్షన్‌ పెంచుతున్న స్లో వాక్సినేషన్‌.. ప్రధాని మోడీ అధ్యక్షతన 11 రాష్ట్రాల సీఎంలతో సమావేశం.. ఎప్పుడంటే..?
Corona Vaccination
Follow us
uppula Raju

|

Updated on: Oct 31, 2021 | 8:20 PM

PM Modi: స్లో వ్యాక్సినేషన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన11 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రులు మన్సుఖ్ మాండవియా, భారతీ పవార్ సమక్షంలో నవంబర్ 3న ఈ సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ అధికారులు కూడా హాజరవుతారు. ఈ సమావేశంలో 40కి పైగా జిల్లాల మెజిస్ట్రేట్‌లు కూడా పాల్గొంటారు.

నవంబర్ నెలాఖరులోపు మొదటి డోస్‌100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి, అలాగే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశం నిర్వహించారు. బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి అనేక రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ప్రథమ, ద్వితీయ స్థానాల్లో వెనుకబడినట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. గడువు ముగిసినా రెండో డోస్ వేసుకునేందుకు దాదాపు 11 కోట్ల మంది ముందుకు రావడం లేదని తెలిసింది. మొత్తంమీద 17 రాష్ట్రాల జనాభా ఇందులో ఉంది.

ఉత్తరప్రదేశ్‌లోని1.6 కోట్లకు పైగా జనాభా రెండో డోస్‌కు వేసుకోవడం లేదు. వీరిలో 50,000 కంటే ఎక్కువ మంది నాలుగు వారాలు దాటినవారు ఉన్నారు. ఇది డోస్‌ల మధ్య నిర్ణీత విరామం కంటే ఎక్కువ. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని 1.10 కోట్లకు పైగా జనాభా ఇంకా రెండో మోతాదు తీసుకోవలసి ఉంది. రాజస్థాన్‌లో 86 లక్షలు, మహారాష్ట్రలో 76 లక్షలకు పైగా రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. అదే సమయంలో బీహార్‌లో ఈ సంఖ్య 72 లక్షలకు పైగా ఉంది. తమిళనాడులో 60 లక్షల మందికి పైగా రెండో డోస్‌కు అర్హత ఉన్నప్పటికీ ఇంకా టీకాలు వేసుకోవడం లేదు. కర్ణాటకలో 51 లక్షలు, గుజరాత్‌లో 42 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో 39.95 లక్షలు, తెలంగాణలో 36.6 లక్షలు, బెంగాల్‌లో 36.16 లక్షలు, జార్ఖండ్‌లో 33.8 లక్షలు, ఒడిశాలో 33 లక్షలు, హర్యానాలో 27 లక్షలు, పంజాబ్‌లో 26.4 లక్షలు, అస్సాం 21 లక్షలకు పైగా రెండో డోసే వేసుకోలేని జనాభా ఉంది.

Indian Railway: రైల్వేలో ఉద్యోగం సంపాదించడం మీ లక్ష్యమా..! అయితే కచ్చితంగా ఈ న్యూస్‌ తెలుసుకోండి..

PMFBY: ప్రధానమంత్రి బీమా యోజన తాజా అప్‌డేట్.. ఈ 3 రాష్ట్రాల రైతులు గరిష్ట ప్రయోజనం పొందారు.. ఎలాగంటే..?

Pawan Kalyan: వైసీపీ సర్కార్‌కు వారం డెడ్‌లైన్ విధించిన జనసేనాని.. చెవుల్లో క్యాబేజీలు పెట్టకండి అంటూ పంచ్‌