Vaccine for Children: శుభవార్త.. త్వరలో చిన్నారులకు కొవిడ్ నుంచి రక్షణ.. ఫలించిన ప్రభుత్వ చర్చలు!
జైడస్ క్యా డిలా రూపొందించిన కొవిడ్ టీకా జైకోవ్-డీ (Zycov-D) టీకాను చిన్నారులకు అందించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Covid-19 Vaccine for Children: రెండేళ్లు గడుస్తున్న కరోనా మహమ్మారి ఇంకా వదలడంలేదు. పెద్దా, చిన్నా తేడాలేకుండా అందరిని కబళిస్తోంది. కోట్లాది మంది కరోనా రాకాసి కోరలకు చిక్కుకుని విలవిలలాడారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి అయా దేశాలు. ఈ క్రమంలోనే విడతల వారీగా వయస్సును బట్టి టీకా పంపిణీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం పిల్లలకు సైతం కరోనా టీకా ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా జైడస్ క్యా డిలా రూపొందించిన కొవిడ్ టీకా జైకోవ్-డీ (Zycov-D) టీకాను చిన్నారులకు అందించేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ సంస్థతో చర్చలు జరిపిన భారత ప్రభుత్వం.. అందరికీ అందుబాటులో ఉండే ధరను అందించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన చర్చలు సపలమైనట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే, అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సిఉంది. కాగా, చిన్నారులకు సూది అవసరం లేకుండా విడ్ టీకా జైకోవ్-డీ (Zycov-D)ను అందించవచ్చని ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈ టీకాను తక్కువ ధరకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే దేశంలో కేవలం 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే టీకాలు వేస్తున్నారు. చిన్నారులకు టీకా వేయడం లేదు. త్వరలో వారికీ టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కొవిడ్ టీకా జైకోవ్-డీ (Zycov-D)ను జైడస్ క్యా డిలా రూపొందించింది. ఈ టీకాకు సంబంధించి తొలుత రూ.1,900కు టీకాను అందజేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై ప్రభుత్వం చర్చలు జరిపింది. మార్కెట్లో ఉన్న టీకాల ధరలు అవసరాలను పరిశీలించింది. చివరగా ఒక డోసు రూ.265కు అందించాలని సంస్థకు సూచించింది. ఇందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీంతో దేశవ్యాప్తంగా తక్కువ ధరకే చిన్నారులకు కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది.
అంతే కాకుండా ఈ టీకాను సూది లేకుండా వాడాలి.. ఇందుకోసం జెట్ అప్లికేటర్‌ను వినియోగించాలి. దాని ధర రూ. 93తో కలుపుకొని ఒక డోసు మొత్తానికి రూ.358 అవనున్నట్లు తెలుస్తోంది. ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో వేసుకోవాల్సి ఉంటుంది. గుజరాత్‌కు చెం దిన జైడస్ క్యా డిలా రూపొందించిన ఈ టీకా.. ప్రపంచంలోనే అనుమతి పొందిన డీఎన్‌ఏ ఆధారిత తొలి కరోనా టీకా.
ఇదిలావుంటే, ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం నుంచి దేశం కోలుకుంటోంది. ఈ సమయంలో కొత్తగా జికా వైరస్ (Zika Virus) వ్యాప్తి చెందుతుందా అనే ఆందోళన ప్రజల్లో మొదలవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మూడు జికా వైరస్ కేసులు నమోదు కావడంపై కలకలం రేపుతోంది. దీంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అధికారులు బాధితులకు సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి వారికి చికిత్స అందించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ బాధితులు ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలో ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన బాధితులను కలిసిన వారిని గుర్తించేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Read Also… పులి చర్మం అక్రమ రవాణా కేసును ఛేదించిన అటవీ శాఖ అధికారులు.. విచారణలో సంచలన నిజాలు!