AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tourist Hub: అమృత్‌సర్‌కి వెళ్తున్నారా.. చరిత్ర, వీరుల గురించి తెలుసుకునేందుకు వీటిని అన్వేషించండి

అమృత్‌సర్ నగరం దీని సాంస్కృతిక వారసత్వం, ఆహారానికి చాలా ప్రసిద్ధి చెందింది. అయితే నగరంలో పాటు నగరం చుట్టుపక్కల చాలా ప్రదేశాలు ఉన్నాయి. వీటి గురించి ప్రజలకు చాలా తక్కువగా తెలుసు. ఎవరైనా సరే గోల్డెన్ టెంపుల్‌ని సందర్శించడానికి అమృత్‌సర్ వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. అక్కడ ఉన్న అనేక ప్రదేశాలను అన్వేషించవచ్చు. ఇక్కడ అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం ఉంది.

Tourist Hub: అమృత్‌సర్‌కి వెళ్తున్నారా.. చరిత్ర, వీరుల గురించి తెలుసుకునేందుకు వీటిని అన్వేషించండి
Amritsar A Tourist Hub
Surya Kala
|

Updated on: Sep 30, 2024 | 8:44 PM

Share

పంజాబ్‌లోని ప్రసిద్ధ నగరం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అమృత్‌సర్. ఇక్కడ ఉన్న స్వర్ణ దేవాలయం, వాఘా బోర్డర్, జలియన్ వాలా బాగ్ వంటి చారిత్రక ప్రదేశాల అందాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. అమృత్‌సర్ నగరం దీని సాంస్కృతిక వారసత్వం, ఆహారానికి చాలా ప్రసిద్ధి చెందింది. అయితే నగరంలో పాటు నగరం చుట్టుపక్కల చాలా ప్రదేశాలు ఉన్నాయి. వీటి గురించి ప్రజలకు చాలా తక్కువగా తెలుసు. ఎవరైనా సరే గోల్డెన్ టెంపుల్‌ని సందర్శించడానికి అమృత్‌సర్ వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే.. అక్కడ ఉన్న అనేక ప్రదేశాలను అన్వేషించవచ్చు. ఇక్కడ అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం ఉంది.

దుర్గియానా ఆలయం

అమృత్‌సర్‌లో ఉన్న దుర్గియానా ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ ఆలయాన్ని లక్ష్మీ నారాయణ దేవాలయం అని కూడా అంటారు. ఇది పవిత్ర సరస్సు మధ్యలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం స్వర్ణ దేవాలయాన్ని పోలి ఉంటుంది.

గోవింద్‌గర్ కోట

పిల్లలతో కలిసి గోవింద్‌గర్ కోటను సందర్శించడానికి వెళ్ళవచ్చు. ఈ కోటను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శించవచ్చు. ఈ లైవ్ మ్యూజియం లోహగర్ చౌక్ సమీపంలోని ఓల్డ్ కాంట్ రోడ్‌లో ఉంది. ఇక్కడ అనేక రకాల మ్యూజియంలు ఉన్నాయి. ఇక్కడ చారిత్రక విషయాలు, చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మహారాజ్ రంజిత్ సింగ్ మ్యూజియం

ఈ మ్యూజియం మహారాజ్ రంజిత్ సింగ్ మ్యూజియానికి అంకితం చేయబడింది. దీనిని సందర్శించడం అందమైన అనుభూతిని ఇస్తుంది. అమృత్‌సర్‌లోని రాంబాగ్ గార్డెన్‌లో ఉన్న ఇది ఒక ప్యాలెస్‌గా ఉండేది.. ఆ తర్వాత మ్యూజియంగా మార్చబడింది. ఈ మ్యూజియంలో 18వ, 19వ శతాబ్దాల సిక్కుల చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

రామతీర్థ మందిరం అమృత్‌సర్

అమృత్‌సర్‌లో ఉన్న రామతీర్థ దేవాలయం రాముడికి అంకితం చేయబడింది. హిందూ విశ్వాసాల ప్రకారం వాల్మీకి మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉండేది. అందుకే దీనిని వాల్మీకి తీర్థ దేవాలయం అని కూడా అంటారు. శ్రీ రాముడు తల్లి సీతను విడిచిపెట్టిన తర్వాత వాల్మీకి మహర్షి ఈ ప్రదేశంలోని తన ఆశ్రమంలో సీతకు ఆశ్రయం ఇచ్చాడని నమ్ముతారు. అలాగే ఈ ప్రదేశంలో లవ కుశలు జన్మించారని నమ్మకం.

పంజాబ్ స్టేట్ వార్ హీరోస్ మెమోరియల్, మ్యూజియం

పంజాబ్ స్టేట్ వార్ హీరోస్ మెమోరియల్, మ్యూజియం సోమవారం మినహా అన్ని రోజులలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇది అమృత్‌సర్‌లోని వాఘా సరిహద్దుకు సమీపంలో ఉంది. ఈ మెమోరియల్-మ్యూజియం ప్రధాన లక్ష్యం పంజాబ్ కి చెందిన వీర సైనికుల ధైర్యసాహసాలను ప్రదర్శిస్తుంది. ఈ కాంప్లెక్స్‌లో 45 మీటర్ల ఎత్తైన స్టెయిన్‌లెస్ స్టీల్ కత్తి సందర్శనకు ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..