New Year 2025: న్యూ ఇయర్‌కి గోవా వెళ్ళాలనుకుంటున్నారా..! బీచ్ మాత్రమే కాదు ఈ ప్రదేశాలను సందర్శించండి..

కొత్త సంవత్సరానికి వెల్కం చెప్పడానికి చాలా మంది ఇప్పటి నుంచి రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది న్యూ ఇయర్ రోజున కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ నూతన సంవత్సరాన్ని గోవాలో జరుపుకోవాలని అనుకుంటున్నట్లయితే..గోవా బీచ్ మాత్రమే కాదు అక్కడ చూడదగిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. న్యూ ఇయర్ వీటిని సందర్శించడం జీవితంలో ఒక జ్ఞాపకంగా మిలిపోతాయి.

New Year 2025: న్యూ ఇయర్‌కి గోవా వెళ్ళాలనుకుంటున్నారా..! బీచ్ మాత్రమే కాదు ఈ ప్రదేశాలను సందర్శించండి..
Goa Travel TipsImage Credit source: pexels
Follow us
Surya Kala

|

Updated on: Dec 04, 2024 | 12:29 PM

గోవా పేరు గుర్తుకు రాగానే కళ్లముందు చాలా సుదూరంలో ఉన్న సముద్రం.. అందమైన బీచ్ దృశ్యం కనువిందు చేస్తుంది. అయితే గోవా అంటే బీచ్ మాత్రమే కాదు ఇంకా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. నవంబర్ నుంచి మార్చి వరకు గోవాకు వెళ్ళడానికి మంచి సముయం. నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఎక్కువ మంది గోవాకు వెళతారు. ఎందుకంటే ఇక్కడ రాత్రి సమయంలో జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ నూతన సంవత్సరాన్ని గోవాకు వెళ్లి జరుపుకోవాలనుకుంటే.. బీచ్‌లో సమయం గడపడం, క్రీడా కార్యకలాపాలతో పాటు అక్కడ సందర్శించడానికి ఉత్తమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

గోవా ఆధునిక జీవనశైలి పర్యాటకులను ఆకర్షిస్తుంది. అందువల్ల సంవత్సరానికి వీడ్కోలు చెప్పడానికి .. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు డిసెంబర్ 31 రాత్రి గోవాకు వెళ్ళడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు.

గోవాలో ఏ బీచ్‌లు ఉన్నాయి?

గోవాలో పలోలెం బీచ్ (ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది), వాగేటర్ బీచ్ (ఇక్కడ కొబ్బరి చెట్లు, తాటి చెట్లను, నల్ల లావా రాళ్లను చూడవచ్చు), బేతాల్‌బాటిమ్ బీచ్, వరకా బీచ్, కాండోలిమ్ బీచ్, మోర్జిమ్ బీచ్, అంజునా బీచ్, కలంగుటే బీచ్, బాగా బీచ్, కలంగుట్ బీచ్ వంటి పర్యాటకులను ఆకర్షిస్తాయి.

ఇవి కూడా చదవండి

దూద్‌సాగర్ జలపాతం

గోవాలోని ప్రసిద్ధ బీచ్‌లను అన్వేషించడమే కాదు ఇక్కడ దూద్‌సాగర్ జలపాతాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్‌లో థ్రిల్‌ను పొందుతారు. ఇది భారతదేశంలోని ఐదవ ఎత్తైన జలపాతంగా పరిగణించబడుతుంది.

షాపింగ్ కోసం ఇక్కడకు వెళ్ళండి

గోవాలోని అంజునా మార్కెట్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది. న్యూ ఇయర్ రోజున గోవా వెళుతున్నట్లయితే షాపింగ్ కోసం ఇక్కడికి వెళ్లవచ్చు. అయితే ఈ మార్కెట్ ఏ రోజు తెరుచుకుంటుంది .. ఎప్పుడు మూసివేస్తారో తప్పనిసరిగా తెలుసుకుని షాపింగ్ కు వెళ్ళాలి.

ప్రకృతి ఒడిలో చోరావ్ ద్వీపం

గోవాలోని చోరావ్ ద్వీపాన్ని అన్వేషించడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ ప్రయాణించడం ఒక ఉత్తమ అనుభవం. ప్రకృతి మధ్య ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసును ప్రశాంతతతో నింపుతుంది. ఇక్కడ సలీం అలీ బర్డ్ శాంక్చురీని సందర్శించడం ఉత్సాహంగా ఉంటుంది.

గోవాలోని పురాతన చర్చి

గోవాకు వెళ్ళిన వారు అక్కడ పురాతన చర్చి అయిన బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్ ని సందర్శించండి. ఈ చర్చి సుమారు నాలుగు వందల సంవత్సరాల నాటిది. దీని వాస్తుశిల్పం చూడదగినది. అంతేకాదు ఇక్కడ కొంత సమయం ప్రశాంతంగా గడపవచ్చు.

గోవాలో ఒక అందమైన దేవాలయం ఉంది

గోవాలో తంబిడి సుర్ల మహాదేవ్ ఆలయాన్ని సందర్శించవచ్చు. 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం కదంబ శైలి శిల్పకళకు చక్కటి సజీవ సాక్ష్యం. ఈ ఆలయం పనాజీకి 65 కిలోమీటర్ల దూరంలో తంబ్డి సుర్ల అనే గ్రామంలో ఉంది. దూద్‌సాగర్ జలపాతం, బోండ్ల వన్యప్రాణుల అభయారణ్యం, భగవాన్ మహావీర్ వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఉన్నాయి.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..