Lizards: ఇంట్లో బల్లులు పోవాలంటే ఏం చేయాలి? అద్భుతమైన చిట్కాలు!

కనిపించని ఇల్లు ఉండటం చాలా అరుదు. ముఖ్యంగా చాలా మంది ఇళ్లల్లో బల్లులు వస్తుంటాయి. ముఖ్యంగా కిచెన్‌లో ఎక్కువ ఉంటుంటాయి. వాటిని తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో మీరు ఈ పద్ధతులను ప్రయత్నిస్తే బల్లులను ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు. ఇంట్లోనే కాకుండా చుట్టూ..

Lizards: ఇంట్లో బల్లులు పోవాలంటే ఏం చేయాలి? అద్భుతమైన చిట్కాలు!
Lizards
Follow us

|

Updated on: Jul 24, 2024 | 2:09 PM

కనిపించని ఇల్లు ఉండటం చాలా అరుదు. ముఖ్యంగా చాలా మంది ఇళ్లల్లో బల్లులు వస్తుంటాయి. ముఖ్యంగా కిచెన్‌లో ఎక్కువ ఉంటుంటాయి. వాటిని తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి పరిస్థితిలో మీరు ఈ పద్ధతులను ప్రయత్నిస్తే బల్లులను ఇంట్లోకి రాకుండా నివారించవచ్చు. ఇంట్లోనే కాకుండా చుట్టూ ప్రాంతంలో కూడా బల్లులు కనిపించవు. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.

  1. ఇంట్లో నెమలి ఈకలను ఉంచండి: బల్లులను నివారించడానికి మీరు ఇంట్లో నెమలి ఈకలను ఉంచవచ్చు. ఇందుకోసం ఇంటి గోడలకు టేపుతో నెమలి ఈకలను అతికించండి. అలాగే బల్లులు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో నెమలి ఈకలను ఉంచండి. ఇలా చేయడం వల్ల కూడా బల్లులు రావు.
  2. గుడ్డు పెంకులను ఉంచండి: బల్లులు రాకుండాలంటే గుడ్ల పెంకులను ఉంచండి. ఎందుకంటే బల్లులకు గుడ్ల పెంకులు అంటే విరక్తి. గుడ్డు పెంకుల సహాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. కిచెన్‌, ఇతర ప్రాంతాల్లో గుడ్ల పెంకులను ఉంచడం వల్ల బల్లులు రావు. బల్లులు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో గుడ్డు పెంకులను ఉంచండి.
  3. నాఫ్తలీన్ బాల్స్‌ ఉపయోగించండి: ఇంట్లో నుండి బల్లులను తరిమికొట్టడానికి నాఫ్తలీన్ బాల్స్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఇంట్లో వివిధ ప్రదేశాలలో నాఫ్తలిన్ బాల్స్ ఉంచండి. ఇది బల్లులను త్వరగా వదిలించుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది. కానీ నాఫ్తలీన్ బాల్స్‌ పిల్లలకు అందుబాటులో ఉండకుండా జాగ్రత్త పడండి.
  4. ఉల్లిపాయను ఉపయోగించండి: బల్లులను వదిలించుకోవడానికి మీరు ఉల్లిపాయను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఇంటి మూలల్లో, ఇవి ఎక్కవుగా తిరిగే ప్రదేశాలలో ఉంచండి. బల్లులు దాని వాసన కారణంగా కొద్దిసేపటికే ఇంటి నుండి వెళ్లిపోతాయి.
  5. నల్ల మిరియాలు: నల్ల మిరియాలు బల్లులను తరిమికొట్టడానికి కూడా ఉపయోగించవచ్చు. దీనికి ఎండుమిర్చి గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. తర్వాత దానికి నీళ్లు కలిపి ద్రావణాన్ని సిద్ధం చేసి స్ప్రే బాటిల్‌లో నింపి ఇంట్లోని పలుచోట్ల పిచికారీ చేయాలి. ఈ స్ప్రే బాటిల్‌ను పిల్లలకు దూరంగా ఉంచండి. బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో స్ప్రే చేయండి.
  6. వెల్లుల్లిని వాడండి: వెల్లుల్లి రెబ్బలను పీల్ చేసి ఇంట్లో, బాత్రూమ్, బాల్కనీ, అలాగే బల్లులు కనిపించే ప్రదేశాలలో ఉంచండి. దాని వాసన కారణంగా బల్లులు కొంత సమయం లో ఇంటి నుండి పారిపోతాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు తెలిపిన ఆధారంగా మీకు అందిస్తున్నాము. )