Children health: మీ చిన్నారులు స్మార్ట్ ఫోన్, టీవీలు వదలడం లేదా? అయితే బీ అలర్ట్.. ఇది తెలుసుకోండి!

అదేంటి డిజిటిలీకరణకు పిల్లలో మానసిక రుగ్మతలకు లింకేంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. అధికంగా సెల్‌ ఫోన్‌, టీవీ, ల్యాప్‌ టాప్‌, ట్యాబ్లెట్‌ ల స్ర్కీన్‌ చూసే పిల్లలో వర్చువల్‌ ఆటిజం వస్తుందని నిపుణులు గుర్తించారు. దీనికి ప్రధాన కారణం ఆ పిల్లల తల్లిదండ్రులేనని చెబుతున్నారు.

Children health: మీ చిన్నారులు స్మార్ట్ ఫోన్, టీవీలు వదలడం లేదా? అయితే బీ అలర్ట్.. ఇది తెలుసుకోండి!
Child Using Phone
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Jan 21, 2023 | 10:05 AM

అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చింది. ఏ మూల ఏది జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. అలాగే అందరినీ డిజిటలైజేషన్‌ వైపు మళ్లించింది. వ్యాపారం, అమ్మకాలు, కొనుగోళ్లు, నగదు లావాదేవీలు ఇలా అన్ని ఆన్‌లైన్‌ వేదికగానే జరిగిపోతున్నాయి. బడులు కూడా డిజిటల్‌ బాట పట్టాయి. విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు అలవాటైపోయాయి. అయితే వీటి ద్వారా ఎంతమేరకు ప్రయోజనాలున్నాయో వాటిని మితిమీరి వాడటం ద్వారా అంతకుమించిన దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ ప్రభావం చాలా అధికంగా ఉంటోంది. అది అనేక మానసిక రుగ్మతలకు దారితీస్తోంది. అదేంటి డిజిటిలీకరణకు పిల్లలో మానసిక రుగ్మతలకు లింకేంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. అధికంగా సెల్‌ ఫోన్‌, టీవీ, ల్యాప్‌ టాప్‌, ట్యాబ్లెట్‌ ల స్ర్కీన్‌ చూసే పిల్లలో వర్చువల్‌ ఆటిజం వస్తుందని నిపుణులు గుర్తించారు. దీనికి ప్రధాన కారణం ఆ పిల్లల తల్లిదండ్రులేనని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..

అసలు ఆటిజం అంటే..

ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఒక మానసిక వ్యాధి. సమాజంలో కలవలేకపోవడం.. ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనుకోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ప్రవర్తనలో పూర్తి మార్పు కనిపిస్తుంది. ఈ వ్యాధి వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అలాగే 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో సర్వసాధారణంగా వస్తుంది.

వర్చువల్‌ ఆటిజం ఎలా వస్తుంది..

వర్చువల్ ఆటిజం ప్రధానంగా 4 , 5 సంవత్సరాల మధ్య పిల్లలలో కనిపిస్తోంది. ఇది తరచుగా మొబైల్ ఫోన్‌లు, PCలు లేదా కంప్యూటర్‌ల వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లకు బానిస కావడం వల్ల వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ల మితిమీరిన వినియోగం, ల్యాప్‌టాప్‌లు, టీవీల స్ర్కీన్‌లను ఎక్కువగా చూడటం వంటి కారణంగా ఈ వర్చువల్‌ ఆటిజం వస్తుంది. ఇది వచ్చిన పిల్లలు సాధారణంగా ఇతరులతో మాట్లాడటానికి ఇబ్బంది పడతారు. గుంపులో త్వరగా కలవలేరు. మొబైల్ ఫోన్లు, టీవీలలో కార్టూన్లు, పిల్లల కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలను చూడటం పిల్లల జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. అంతేకాక టీవీలో చూసిన వాటిని పునరావృతం చేసే పిల్లలు.. దాని అర్థం ఏమిటో తెలియక పోవడం వల్ల వారి మానసికంగా ఇబ్బందులు పడతారు.

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రులదే బాధ్యత..

వర్చువల్ ఆటిజం అనేది మానసిక వికాస రుగ్మత, దీనిని పూర్తిగా నివారించవచ్చు.. చికిత్స చేయవచ్చు. ఈ వర్చువల్‌ ఆటిజం వచ్చిన పిల్లల ప్రవర్తన బట్టి తల్లిదం‍డ్రులే గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లల ప్రతి కార్యాచరణపై శ్రద్ధ వహించాలి. పిల్లల మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ కంప్యూటర్లలో గడిపే సమయాన్ని నియంత్రించాల్సిన బాధ్యత తల్లిదండ్రులందరిపైనే ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలతో గరిష్ట సమయం గడపాలి. కార్టూన్, YouTube, ఇతర సామాజిక ప్లాట్‌ఫారమ్‌లకు దూరంగా ఉండాలని వారికి చెప్పాలి. తమ పిల్లలను ప్లే గ్రౌండ్‌లో ఆడుకోనివ్వడం, యోగా, వ్యాయామం (శారీరక శ్రమ)లో పాల్గోనేలా చేయడం అవసరం. రోజుకు కనీసం 45 నిమిషాలకు మించి మొబైల్ ఉపయోగించకుండా చూడాలి. పిల్లలను సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..