AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetables: కూరగాయలను వండుకోవాలా.. పచ్చిగా తినాలా? ఇదిగో ఇలా చేస్తే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

అంటే కూరగాయలను పచ్చిగా తింటే ఆరోగ్యమా? లేక వండుకొని తింటే ఆరోగ్యమా? ఈ విషయంపై అనేక భిన్న వాదనలు ఉన్నాయి. కొందరు ఉడికించి తింటే ఆరోగ్యమని చెబుతుంటే.. మరికొందరు పచ్చిగా తింటేనే మేలని చెబుతుంటారు.

Vegetables: కూరగాయలను వండుకోవాలా.. పచ్చిగా తినాలా? ఇదిగో ఇలా చేస్తే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
Vegetables
Madhu
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 21, 2023 | 10:03 AM

Share

ప్రకృతిలో లభించే వాటిని ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. వాటిల్లో ఆకుకూరలు, కూరగాయలు మొదటి స్థానంలో ఉంటాయి. ఇదే విషయాన్ని పోషకాహార నిపుణులు కూడా చెబుతుంటారు. ముఖ్యంగా కూరగాయల శరీర ఆరోగ్యానికి వరప్రదాయినులని అందరూ పిలుస్తారు. అయితే అవి ఎంత ఆర్యోగాన్ని ఇస్తున్నా.. వాటిని ఎలా తినాలి అనే విషయంపై ఇప్పటికే చర్చ నడుస్తూనే ఉంటుంది. అంటే కూరగాయలను పచ్చిగా తింటే ఆరోగ్యమా? లేక వండుకొని తింటే ఆరోగ్యమా? ఈ విషయంపై అనేక భిన్న వాదనలు ఉన్నాయి. కొందరు ఉడికించి తింటే ఆరోగ్యమని చెబుతుంటే.. మరికొందరు పచ్చిగా తింటేనే మేలని చెబుతుంటారు. ఇంకొందరి వాదనైతే కొన్ని కూరగాయలు పచ్చిగా తినాలని.. మరికొన్ని కూరగాయలు వండుకొని తినాలని చెబుతున్నారు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..

కూరగాయలు ఒక్కోటి ఒక్కో రుచిని కలిగి ఉంటాయి. వాటిని మనం తినే పద్ధతిపై ఆధారపడి.. అంటే వండుకొని తింటున్నామా.. పచ్చిగా తింటున్నామా అనే అంశాల ఆధారంగా పోషక విలువలు శరీరానికి అందుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, జెజియాంగ్ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, బ్రోకలీని వేయించడం, మైక్రోవేవ్ చేయడం, ఉడకబెట్టడం వంటివి చేయడం ద్వారా దాని లోని నుంచి క్లోరోఫిల్, కరిగే ప్రోటీన్, చక్కెరలు. విటమిన్ సీ స్థాయిలు తగ్గిపోతాయని పరిశోధకులు కనుగొన్నారు. అయితే అధికంగా కూరగాయలు వండుకొని తింటేనే మంచి పోషకాలు లభిస్తాయని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకోసం కూరగాయలను ఉడకబెట్టడం, వేయించడం ఉత్తమమైన మార్గాలు అని పరిశోధకులు అంటున్నారు.

వండుకొని తినడం ద్వారా పోషకాలు..

బచ్చలికూర.. ఇది ఆకు పచ్చని పోషకాలతో నిండి ఉంటుంది. దీన్ని ఉడికించి తింటే మరింత కాల్షియం, ఐరన్‌ను శరీరానికి అందుతుంది. ఎందుకంటే బచ్చలికూర ఆక్సాలిక్ యాసిడ్‌తో నిండి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

టమోటాలు.. బస్టైర్ యూనివర్సిటీలోని న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ సైన్స్ విభాగం ప్రకారం, టమోటాలు ఉడికించినప్పుడు విటమిన్ సీ చాలా వరకు కోల్పోతాయి. అయినప్పటికీ, 2002లో జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో వండిన టొమాటోలు పచ్చి వాటి కంటే ఎక్కువ లైకోపీన్ స్థాయిలను కలిగి ఉన్నాయని కనుగొంది.

పుట్టగొడుగులు.. యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను దెబ్బతినకుండా రక్షించగల చిన్న పదార్థాలు, ఇవి కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పుట్టగొడుగులు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. వండిన పుట్టగొడుగులలో పచ్చి వాటి కంటే పొటాషియం, నియాసిన్, జింక్ అధిక స్థాయిలో ఉంటాయి.

క్యారెట్లు.. బీటా-కెరోటిన్ అనేది కెరోటినాయిడ్ అని పిలువబడే పదార్థం ఉంటుంది. అలాగే శరీరానికి అవసరమైన విటమిన్ ఎను ఇది అందిస్తుంది. ఇది ఎముకల పెరుగుదలకు, మీ కను దృష్టిని మెరుగుపరచడంలో సాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..