ఓ యువకుడి నిర్లక్ష్యం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. సెల్ ఫోన్ రిపేర్ షాపులో లిథియం బ్యాటరీని నోటిలో పెట్టుకుని కొరకడంతో అది ఒక్కసారిగా పేలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి యువకుడి నోరు, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అయింది.